నేడు తల్లితో పాటు కౌన్సెలింగ్‌కు యాంకర్ ప్రదీప్, ఏం శిక్ష పడుతుంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తప్పతాగి పోలీసులకు పట్టుబడిన యాంకర్ ప్రదీప్ సోమవారం బేగంపేట ట్రాఫిక్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. ఆయనకు కౌన్సెలింగ్ కోసం పోలీసులు గత శుక్రవారం వరకు సమయం ఇచ్చారు.

అయితే అప్పటికే కాల్షీట్ల కారణంగా బిజీగా ఉండటంతో అతను మరో రెండో రోజుల సమయం అడిగారు. దీంతో పోలీసులు అతనికి సమయం ఇచ్చారు. దీంతో ఆయన వీలు చూసుకొని సోమవారం కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కౌన్సెలింగ్‌కు యాంకర్ ప్రదీప్!: తప్పును అంగీకరించి 'నిలబెట్టుకున్నాడు'!

Pradeep to attend for counselling today

ఆయన తన తల్లితో కలిసి కౌన్సెలింగ్‌కు వస్తాడని పోలీసు అధికారులు చెప్పారు. సోమవారం వస్తానని చెప్పాడని, ఈ మేరకు గత వారంలోనే తమకు సమాచారం అందించాడని పోలీసులు అంటున్నారు.

ప్రదీప్‌కు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టు ముందు హాజరు పరుస్తామని, శిక్ష ఏమిటన్నది కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో ప్రదీప్ రక్తంలో ఆల్కాహాల్ కంటెంట్ 178 పాయింట్లుగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ స్థాయిలో మద్యం తాగిన వాళ్లకు రెండు నుంచి వారం రోజుల పాటు జైలు శిక్షను విధించవచ్చునని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anchor Pradeep to attend counselling today (monday - 08-01-2018) at Begumpet Police Station with his mother.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి