ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు: మళ్ళీ విరుచుకుపడిన ప్రకాష్ రాజ్!!
తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం రాజకీయాలలో సంచలనంగా మారింది. తెలంగాణా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోలను ప్రదర్శించి మరీ బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిర పరచటం కోసం ఈ తరహా చర్యలకు దిగుతుందని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ ముఖ్య నాయకులు ఇదంతా టీఆర్ఎస్ పార్టీ సృష్టి అని, దీనికి కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం అంతా కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో రివర్స్ ఎటాక్ చేశారు.

మాన మర్యాదలను అమ్ముకున్న వాళ్ళు : బీజేపీని టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్
ఇక ఈ సమయంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ మరోమారు బీజేపీని టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీని టార్గెట్ చేసిన సినీనటుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీ గ్యాంగ్ అంటూ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా మండిపడిన ప్రకాష్ రాజ్ ఢిల్లీ కి చెందిన సిగ్గు లేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాన మర్యాదలను అమ్ముకున్న వాళ్ళు, ప్రజా స్వామ్యాన్నే వేలానికి పెట్టారు అంటూ ట్వీట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ ప్రదర్శించిన వీడియో ను ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు.

బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న ప్రకాష్ రాజ్
ఇక ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సినీనటుడు ప్రకాష్ రాజ్ తమదైన శైలిలో మందిపడుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికార పార్టీ దేశంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలలో బీజేపీ చేసిన పనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ చేస్తున్నారని, ఆ దొంగలకు పనిలేదని బీజేపీని టార్గెట్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అన్ని చోట్ల వారు ఎమ్మెల్యేల కొనుగోళ్ళను చేస్తున్నారని పేర్కొన్నారు.

సిగ్గు లేని బీజేపీ దిగజారిపోయిందని వ్యాఖ్యలు
ఇక సోషల్ మీడియా వేదికగానూ ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంతకు ముందే సంచలన ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు యత్నించిన బీజేపీని టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్ వారు రాజకీయ భద్రత కండోమ్‌లను విక్రయిస్తున్నారా? అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. సిగ్గులేని బీజేపీ ఎంతగా దిగాజారిపోతుందో చూడాలని మరో ట్వీట్ లో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉండాలని పేర్కొన్న ఆయన కేసీఆర్ కు మద్దతుగా బీజేపీ సర్కార్ ను వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్నారు
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications