తత్కాల్ టికెట్ల జారీ విషయంలో తాజా మార్పులు, ఆ ఖాతాలు డీయాక్టివేట్..!!
తత్కాల్ టికెట్ల జారీ విషయంలో రైల్వే శాఖ వరుసగా కీలక మార్పులు చేస్తోంది. నకిలీలకు చెక్ పెట్టి.. ప్రయాణీకులకు వెసులుబాటు కలిగించేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు మార్పులు అమలు చేస్తోంది. ఆధార్ ఆధారిత OTP ధృవీకరణను తీసుకొచ్చింది. దీంతో పాటుగా మరి కొన్ని చర్యలకు సిద్దమైంది. ఇదే సమయంలో పార్లమెంట్ వేదికగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేసారు.
తత్కాల్ టికెట్ల విషయంలో ప్రయాణీకులకు మెరుగైన విధానం అమల్లోకి తెస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. సేవల విషయంలో అవసరమైన మార్పులు చేస్తున్నామని చెప్పారు. తాజాగా తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రయాణీకుల నుంచి మద్దతు లభిస్తుందని వివరించారు. తత్కాల్ టికెట్ల విషయంలో వస్తున్న ఫిర్యాదులు.. సూచనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

అందులో భాగంగా IRCTC ఖాతాల ఏరివేతనూ అదే స్థాయిలో చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు రైల్వే అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. AKAMAI వంటి యాప్ బాట్ టెక్నాలజీని వినియోగించి నకిలీ, ఆటోమేటెడ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
అదే సమయంలో సామాన్యులకు సాధారణ, తత్కాల్ టికెట్లు అందేలా రిజర్వేషన్ వ్యవస్థ తీర్చి దిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. తత్కాల్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆధార్ బేస్డ్ ఓటీపీ వ్యవస్థను దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం 322 రైళ్లకు దీనిని వర్తింప చేసామని చెప్పారు. దీన ద్వారా ఆయా రైళ్లల్లో తత్కాల్ టికెట్ల సమయం దాదాపు 65 శాతం మేర పెరిగిందన్నారు.
అదే విధంగా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ బుకింగ్స్ కు ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని డిసెంబర్ 4వ తేదీ వరకు 211 రైళ్లకు వర్తింప చేసినట్లు వివరించారు. దీని కారణంగా 96 పాపులర్ రైళ్ల టికెట్ల అందుబాటు సమయం 95 శాతం మేర పెరిగిందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. తత్కాల్ టికెటింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం గట్టి నిఘా ఉంచిందని చెప్పారు. దశల వారీగా మరి కొన్ని మార్పులకు టికెట్ల జారీ వ్యవస్థలో తీసుకురానున్నట్లు ప్రకటించారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications