సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో: మండిపడ్డ రేవంత్ రెడ్డి!!
సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ లోని రూబీ ప్రైడ్ హోటల్ క్రింద ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో ఎలక్ట్రిక్ బైక్ లు పేలి 8మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాద ఘటనలో మరో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి, యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సికింద్రాబాద్ లో టూరిస్టుల దుర్మరణం
ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు దుర్మరణం పాలయ్యారని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గతంలో హైదరాబాద్లో అనేక అగ్ని ప్రమాద ఘటనలు జరిగి ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.

గతంలో ఘటనలు జరిగినా కఠినంగా నియమ నిబంధనలు అమలు చెయ్యని సర్కార్
ప్రభుత్వ నిర్లక్షమే ఇంతటి విపత్తులకు కారణం అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఇలాంటి అగ్నిప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అన్నారు రేవంత్ రెడ్డి. గతంలో సికింద్రాబాదులోని ఇనుప తుక్కు గోడౌన్ లో కూడా ఇటువంటి ప్రమాదం జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే అగ్నిప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications