మాటిచ్చిన వెంటనే నెరవేర్చిన షర్మిళ.!ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేత.!
హైదరాబాద్ : రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేస్తుంటారు. కానీ వాటిని నెరవేర్చడం మాత్రం అసలు జరగని పని. రాజకీయాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటే మంచి మనసుండాలి. స్పందించే గుణం ఉండాలి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైయ్యస్సార్ టీపి అధ్యక్షురాలు వైయస్ షర్మిళ గొప్ప ఉదార భావాన్ని చాటుకున్నారు. ఎదుటి వారి సమస్యల పట్ల తీవ్రంగా చలించిపోయి సాయం చేయడానికి ఆపన్న హస్తం అందించారు. దీంతో ఆధారం కోల్పోయిన కొన్ని జీవితాల్లో భరోసా నింపారు షర్మిళ. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిల గారు ఇందిరా పార్క్‌లో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల దీక్షకు బుధవారం ఉదయం సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.

అనేక కారణాల వల్ల మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలకు 25వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం సాయంత్రం లోటస్ పాండ్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి ఇందిరా శోభన్ బాధితులకు 25వేల రూపాయల చొప్పున తొమ్మిది మందికి ఆర్థిక సాయం అందజేశారు. ఇకముందు కూడా వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాయం అందుకున్న వారిలో పుష్పలత (వికారాబాద్), మాధవి (ములుగు), మహమ్మద్ రేష్మ (మహబూబాబాద్), కస్తూరి లావణ్య (నిర్మల్), పద్మమ్మ (వికారాబాద్), స్వరూప (నాగర్‌కర్నూల్), నరేష్ (సిద్ధిపేట), సువర్ణ (వికారాబాద్), ఆత్రం సుమిత్ర (ఆదిలాబాద్)లు ఉన్నారు. భవిష్యత్తులో వారి పిల్లల చదువులకు సంబంధించి సహాయం చేసేందుకు పార్టీ సిద్దంగా ఉంటుందని నాయకులు స్పష్టం చేసారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications