తేజస్వి నా శత్రువు: శిరీషను డార్లింగ్ అంటూ రాజీవ్‌, నవీన్ ఫోన్ సంభాషణ ఇలా

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఇప్పటికే శిరీషకు, రాజీవ్‌కు శారీరక సంబంధం ఉందని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా శిరీష.. తేజస్విని తన శత్రువుగా భావిస్తున్నట్లుగా చెప్పిన ఫోన్ సంభాషణలు బహిర్గతమయ్యాయి. ఇందులో రాజీవ్, శిరీష మధ్యలో మరో స్నేహితుడు నవీన్ తెరపైకి వచ్చాడు.

రాజీవ్, శిరీష, నవీన్ ఫోన్ సంభాషనలను గమనించినట్లయితే...

శిరీష కేసులో శ్రవణే ఏ1 ఎందుకంటే..?: చంచల్‌గూడ జైలుకు నిందితులు

డార్లింగంటూ రాజీవ్..

డార్లింగంటూ రాజీవ్..

రాజీవ్: డార్లింగ్

శిరీష: హా చెప్పు

రాజీవ్: నాకు రికార్డింగ్ అయితే కనబడటం లేదు..

రవికి ఫోనివ్వు..

రవికి ఫోనివ్వు..

శిరీష: నీ పక్కన రవికి ఫోన్ ఇవ్వు

రాజీవ్: రవి కాదు నవీన్ నా పక్కన ఉన్నది

శిరీష: హా.. వాడికివ్వు..

నవీన్: హాలో..

శిరీష: ఇందాక మాట్లాడింది నీతోనే కదా.. గుర్తుందా
ఇందాక మాట్లాడా కదా..

రికార్డింగ్ కావాలన్నావు కదా..

రికార్డింగ్ కావాలన్నావు కదా..

నవీన్: గుర్తుంది
నవీన్ మాట్లాడుతున్నా..
రికార్డింగ్ కాల్ కావాలన్నావ్ కదా..

శిరీష: వాడికి అందులో ఎక్కడుందో తెలియడం లేదంట..
కొంచెం వెతికి పంపించవా.. కావాలి..

నాకు ఎనీమీనే: శిరీష

నాకు ఎనీమీనే: శిరీష

నవీన్: ఇందాక అయితే గలీజ్ గలీజ్ గా తిట్టేశాడు

శిరీష: తిట్టాడు కానీ.. నాకు ఆ రికార్డింగ్ కావాలి

నవీన్: తను నీకేమవుతుంది..
ఫ్రెండ్ అవుతుందా?
ఎనిమీనా?..

శిరీష: ఎనీమీ.. నా ఎనిమీ

టార్చర్ పెట్టినం.. హ్యాపీగా ఉండూ..

టార్చర్ పెట్టినం.. హ్యాపీగా ఉండూ..

నవీన్: ఓకే.. నువ్ హ్యాపీగా ఉండు.. టార్చర్ చూపెట్టినం దానికి

శిరీష: లేదు.. నాకు ఆ రికార్డ్ కావాలి.. ప్లీజ్ అర్థం చేసుకోండి
ఎందుకు నన్నిలా టార్చర్ పెడతారు?..

రికార్డింగ్ కాల్ ఆన్‌లో లేదు

రికార్డింగ్ కాల్ ఆన్‌లో లేదు

నవీన్: రికార్డింగ్ కాల్ ఆన్ లేదు..
కొత్త ఫోన్ కదా..
రికార్డింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదు

శిరీష: రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్‌లో..

నవీన్: ఒక్క నిమిషం నేను చెక్ చేస్తా..
నువ్ వాట్సప్ నంబర్ పంపించు

శిరీష: ఓకే...
ఇలా సాగింది వారి సంభాషణ. అయితే, రాజీవ్ నిజంగానే తేజస్వినిని తిట్టాడా లేఖ శిరీష కోపంగా ఉందనే అలా చెప్పాడనే అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా, శిరీష ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కూడా అనుమానస్పాద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు మృతులపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that beautician Sirisha hates Tejaswi, who is loving Rajeev.
Please Wait while comments are loading...