హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కాచెల్లెళ్ల హత్య: వారం ముందే అమిత్ సింగ్ పథకం?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పథకం ప్రకారమే అక్కాచెల్లెలను అమిత్ సింగ్ హత్య చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. శ్రీలేఖ హత్య కోసం వారం రోజుల ముందు నుంచి అమిత్ సింగ్ అవకాశం కోసం ఎదురు చూసినట్లు చెబుతున్నారు. ఐదు రోజుల కస్టడీలో విచారణలో అమిత్ సింగ్ అనేక ఆసక్తికరమైన విషయాలను దర్యాప్తు అధికారులకు వెల్లడించాడని తెలిసింది.

యామిని సరస్వతి, శ్రీలేఖలను చంపేందుకు ముందుగానే మూడు కత్తులను అమిత్‌సింగ్ దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట ప్రాంతాల్లో కోనుగోలు చేశాడని పోలీసులకు వెల్లడించాడు. జూలై 14న చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్ అమిత్ సింగ్ ఉదయం 8.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి యామిని సరస్వతి, శ్రీలేఖను దారుణంగా పోడిచి చంపేశాడు.

Sisters murder: Planned murder of Amit Singh

ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు 12 రోజుల తర్వాత మహారాష్ట్ర నుంచి అంబులెన్స్‌లో వస్తుండగా సైబరాబాద్ పోలీసులు మేడ్చల్ ప్రాంతంలో అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణకు ప్రయత్నించారు. ఆ సమయంలో అమిత్‌సింగ్ ఆరోగ్యం సహకరించకపోవడంతో అతనిని తిరిగి వెనక్కి పంపించారు

ఇటీవల మూడు రోజుల ముందు మరోసారి కస్టడీలోకి తీసుకున్న చైతన్యపురి పోలీసులు కేసుకు సంబంధించిన ఆధారాలను అమిత్‌సింగ్‌తో కలిసి సేకరిస్తున్నారు. అక్కాచెల్లెలను హత్య చేసిన తర్వాత చైతన్యపూరి నుంచి ఆరు రాష్ర్టాలు ఎలా ప్రయాణం చేశాడు, ఎక్కెడెక్కడ బస చేశాడు. ప్రయాణానికి సంబంధించిన టికెట్లతో పాటు బస చేసిన ప్రాంతంలో పలువురి స్టేట్‌మెంట్‌లను పోలీసులు సేకరించారు.

English summary
It is said that Amit Singh has killed two sister Srilekha and Yamini Saraswathi with pre planned sketch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X