హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాప్ట్‌వేర్ చీటింగ్: ఒక్కొక్కరి నుంచి 50వేల నుంచి లక్ష వసూలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో సాప్ట్‌వేర్ సంస్ధ మూత పడింది. అమర్‌పేటలో ఏఎంసీ స్కేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏఎంసీ స్క్వేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఘరానా మోసానికి పాల్పడింది.

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి సుమారు రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగాల పేరుతో ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.50 నేల నుండి రూ. లక్ష వరకు డబ్బులు వసూలు చేశారు.

హైదరాబాద్

ఇలా సుమారు 140 మంది నిరుద్యోగుల నుంచి వసూలు చేసి సడన్‌గా బిచాణా ఎత్తేసిన కంపెనీ నిర్వాహకులు. ఏఎంసీ స్కేర్ పేరుతో ఓ సాప్ట్‌వేర్ కంపెనీని స్ధాపించి, ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తామని ముందుగా నమ్మబలికారు.

శనివారం సంస్ధ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో తామంతా మోసపోయామంటూ 30 మంది బాధితులు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Software placement consultancy AMC cheats unemployed in Ameerpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X