వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకాంత్ చారి వర్ధంతి: కెసిఆర్ హామీ, ఓ జిల్లాకు పేరు పెట్టాలని తల్లిదండ్రులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నల్గొండ: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి స్వగ్రామం పొడిచేడుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గురువారం అన్నారు. శ్రకాంత్ చారి వర్ధంతి సభను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

వచ్చే వర్ధంతి నాటికి పొడిచేడులో శ్రీకాంత్ చారి స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన తన కుమారుడి పేరును కొత్తగా ఏర్పాటు చేసే మరో జిల్లాకు పెడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాలని శ్రీకాంత్ చారి తల్లిదండ్రులు అన్నారు.

శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆ తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటాచారిలు విజ్ఞప్తి చేశారు. శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా వారు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఎల్పీనగర్ రింగ్ రోడ్డులో నిర్వహించిన శ్రీకాంత్ చారి వర్ధంతి కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా వచ్చారు.

శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరదన్నారు.

శ్రీకాంత్ చారి వర్ధంతి

శ్రీకాంత్ చారి వర్ధంతి

అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంత్ చారి ఫోటోను పెట్టి నివాళులు అర్పిస్తున్న టిఆర్ఎస్ నాయకులు.

 శ్రీకాంత్ చారి వర్ధంతి

శ్రీకాంత్ చారి వర్ధంతి

అమరవీరుల కుటుంబాలకు సాయం అందించడమే కాకుండా అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని నాయిని చెప్పారు.

శ్రీకాంత్ చారి వర్ధంతి

శ్రీకాంత్ చారి వర్ధంతి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి మీద సీమాంధ్ర పాలకులు బనాయించిన కేసుల్లో ఇప్పటికే 1000 కేసులను సర్కారు ఎత్తివేసిందని, మిగిలిన కేసులను త్వరలో ఎత్తివేస్తామని నాయిని చెప్పారు.

 శ్రీకాంత్ చారి వర్ధంతి

శ్రీకాంత్ చారి వర్ధంతి

మరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నాయిని తెలిపారు.

English summary
Srikanth Chary, who was commited suicide for Telangana state, death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X