రేపిస్ట్ రాజు మృతిపై అనుమానం .. హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటీషన్, నేడు విచారణ
సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పరారైన రాజు ఎట్టకేలకు విగతజీవిగా రైల్వే ట్రాక్ పై దొరికాడు. నిన్న స్టేషన్ ఘనపూర్ సమీపంలోని నష్కల్ రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు శవమై కనిపించాడు. అయితే పోలీసులు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ధృవీకరించారు.

హైకోర్టులో రాజు మృతిపై పిల్ వేసిన పౌరహక్కుల సంఘం
సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన రాజు నష్కల్ వద్ద రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ధృవీకరించినా రాజు కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు రాజు మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తాజాగా పౌర హక్కుల సంఘం సైదాబాద్ అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పాలకొండ రాజు మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో రాజు మృతిని కస్టోడియల్ మృతిగా అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులోనే రాజు చనిపోయినట్టుగా అనుమానాలున్నాయని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.

నేడు పిల్ పై విచారణ ... రాజు మృతికి పోలీసులే కారణం అన్న తల్లి
ఇక దీనిపై మధ్యాహ్నం 1:00 కు హైకోర్టు విచారణ చేపట్టనుంది. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నేపధ్యంలో రాజు మృతిపై రాజు కుటుంబ సభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. తమ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారని, పోలీసులు తమ కొడుకును చంపేశారని రాజు తల్లి ఆరోపించింది. రాజు తల్లి ఈరమ్మ తప్పు చేస్తే కోర్టుకు అప్పగించాల్సిందని, అలా కాకుండా పోలీసులే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని , తాము ఎలా బతకాలో చెప్పాలని వాపోయింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. పోలీస్ స్టేషన్లో తాము ఉన్నప్పుడే రాజును పట్టుకున్నారని చెప్పుకుంటుంటే విన్నాను అని, కానీ చంపేసి రైలు పట్టాలపై పడేశారని, ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ చెప్పారని లబోదిబోమంది. ఇక తమ ఇంటిని బాధిత చిన్నారి బంధువులు కూలగొట్టారని పేర్కొన్న ఈరమ్మ కనీసం తలదాచుకోడానికి కూడా దిక్కు లేదని వాపోయింది.

తన భర్తను పోలీసులే చంపేశారన్న రాజు భార్య
ఇక రాజు భార్య, అత్త రాజు మరణంపై లబోదిబో మన్నారు. తమతో పోలీసులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, రాజు చనిపోయే ముందు రోజు రాత్రి వరకు తమను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని, మొన్న రాత్రి తమను వదిలి పెట్టారని వారు చెబుతున్నారు. తన భర్తను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని రాజు భార్య ఆరోపిస్తోంది. తనకు 11 నెలల కూతురు ఉందని పేర్కొన్న రాజు భార్య ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగితే మరి నాకు, నా బిడ్డకు న్యాయం మాటేంటి అంటూ ప్రశ్నిస్తుంది. తనకు తన కూతురుకు దిక్కెవరు అంటూ లబోదిబోమంది.

కుటుంబ సభ్యులు చెప్పిన మాటలతోనే అనుమానం .. కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
రాజు కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు అనుమానం వ్యక్తం చేసిన పౌరహక్కుల సంఘం హైకోర్టులో రాజు మరణంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. రాజు మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీని పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. రాజు ఆత్మహత్యతో తనకు తానే శిక్ష వేసుకున్నాడని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో చిన్నారికి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ఉధృతం కావటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications