Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ తాజాగా ఆమోదం తెలిపింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు-2026'ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీని ప్రకారం పేరెంట్స్ ను పట్టించుకోని ఉద్యోగి వేతనంలో 15 శాతం కోత విధిస్తారు. ఆ నగదును పేరెంట్స్ ఖాతాలో జమ చేస్తారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఈ చట్టం వర్తిస్తుంది. పేరెంట్స్ ను పట్టించుకోని వారికి ఇది గుణపాఠం అని.. అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తిని ధారపోస్తారని.. కానీ పిల్లలు మాత్రం రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్నారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవడానికి ఈ చట్టం తెచ్చామని తెలిపారు.

ఇక సహాయం కోరుకునే తల్లిదండ్రులు ఒక ప్రత్యేక అధికారికి, సాధారణంగా జిల్లా కలెక్టర్‌ కు, అధికారిక దరఖాస్తును సమర్పించుకోవచ్చు. కేసును సమీక్షించి, తగిన ఆర్థిక భత్యాన్ని నిర్ణయిస్తారు. ఈ కోత ఉద్యోగి జీతంలో 15 శాతం లేదా నెలకు రూ. 10,000.. ఇలా ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఉంటుంది. దరఖాస్తులను తల్లి, తండ్రి విడివిడిగా లేదా ఉమ్మడిగా సమర్పించుకునే అవకాశం ఉంది. సంబంధిత అధికారి 60 రోజుల్లో ఈ విషయాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.

Telangana Assembly Passes Bill 15 Salary Deduction for Employees Neglecting Parents parental care

అయితే ప్రత్యేక అధికారి చర్యలు తీసుకోవడంలో విఫలం అయితే.. ఆ తల్లిదండ్రులు పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. జవాబుదారీతనం, నిబంధనల పాటించడాన్ని నిర్ధారించడానికి ఆ న్యాయమూర్తి రాష్ట్రస్థాయిలో కమిషనర్‌ గా వ్యవహరిస్తారు. ఈ చట్టాన్ని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు సైతం వర్తింపజేస్తూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+