Degree లో కొత్త కోర్సులు, MA ఏవియేషన్. BA డిఫెన్స్..
తెలంగాణలో ఉన్నత విద్యారంగం సరికొత్త మలుపు తిరుగుతోంది. కేవలం సర్టిఫికెట్ల కోసమే కాకుండా, చదువు పూర్తికాగానే నేరుగా ఉద్యోగాల్లో చేరేలా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి డిగ్రీ, పీజీల్లో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంప్రదాయ కోర్సుల కంటే భిన్నంగా, కార్పొరేట్ రంగంలో భారీ డిమాండ్ ఉన్న కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి ప్రైవేటు కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల యాజమాన్యాలు మార్చి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Degree: కోర్సు ఎందుకు? వెబ్సైట్లోనే పూర్తి వివరాలు!
సాధారణంగా కొత్త కోర్సు అనగానే విద్యార్థుల్లో అనేక సందేహాలు ఉంటాయి. వీటిని నివృత్తి చేసేందుకు విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఏ కోర్సును ఎందుకు ప్రవేశపెడుతున్నాం? ఆ కోర్సు పూర్తి చేస్తే ఏయే రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి? వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. దీనివల్ల విద్యార్థులు తమ కెరీర్‌పై స్పష్టమైన అవగాహనతో కోర్సులను ఎంచుకోవచ్చు.
రాబోతున్న కొత్త కోర్సులు ఇవే..
విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా వివిధ విభాగాల్లో ఈ కోర్సులను డిజైన్ చేశారు:
- బీఏ (BA): డిఫెన్స్, సెక్యూరిటీ, పొలిటికల్ సైన్స్.
- బీకాం (B.Com): ఫిన్‌టెక్ (FinTech), బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, డిజిటల్ మార్కెటింగ్.
- బీబీఏ (BBA): ఎయిర్పోర్ట్, ఎయిర్‌లైన్స్, ఏరోస్పేస్ మేనేజ్మెంట్; ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ మేనేజ్మెంట్; రూరల్ మేనేజ్మెంట్.
- బీఎస్సీ (B.Sc): మల్టీ మీడియా డిజైన్ అండ్ యానిమేషన్; ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్.
- పీజీ (MA): ఏవియేషన్ మేనేజ్మెంట్; డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్.
అప్రెంటిస్‌షిప్‌తో మరింత భరోసా
కేవలం కొత్త కోర్సులే కాకుండా, సుమారు 70 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 'అప్రెంటిస్‌షిప్' కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నారు. అంటే విద్యార్థులు తరగతి గదిలో పాఠాలు వినడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పని చేస్తూ అనుభవాన్ని కూడా గడించవచ్చు. పాత కోర్సుల స్థానంలో ఈ నూతన కోర్సులను మార్చుకోవడానికి లేదా మాధ్యమాన్ని (మీడియం) మార్చుకోవడానికి కూడా కళాశాలలకు అవకాశం కల్పించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications