Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revanth Reddy ఆన్ ఫైర్: ఇంద్రవెల్లికి ర్యాలీగా: టీఆర్ఎస్ ఏం చెబుతోంది?: ఆ కాంగ్రెస్ నేత డుమ్మా

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేతగా పగ్గాలను అందుకున్న ఆ పార్టీ మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. ఊపు మీద ఉన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దళిత బంధు పథకాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోన్నారాయన. ఒక్కో నియోజకవర్గంలో ఎంపిక చేసిన వారికి మాత్రమే వర్తింపజేయడానికి ఉద్దేశించిన ఈ పథకంలో దళితులు, గిరిజనులను కూడా లబ్దిదారులుగా చేర్చాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.

 తొలి బహిరంగ సభ..

తొలి బహిరంగ సభ..

ఈ డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో లక్షమందితో బహిరంగ సభను నిర్వహించ తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీనికి దళిత-గిరిజన దండోరాగా పేరు పెట్టింది. రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలను అందుకున్న తరువాత ఏర్పాటు కానున్న తొలి బహిరంగ సభ ఇది. దీనితో కాంగ్రెస్ శ్రేణులు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ సభను విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి చేశాయి. ఈ సభలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రవెల్లిలో సభ ప్రారంభం కానుంది. కనీసం లక్షమందికి పైగా దళితులు, గిరిజనులను సమీకరించనుంది కాంగ్రెస్ పార్టీ.

 జగ్గారెడ్డి గైర్హాజర్..

జగ్గారెడ్డి గైర్హాజర్..

కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ బహిరంగ సభకు సీనియర్ నేత, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి గైర్హాజర్ కానున్నారు. ఈ సభకు తాను హాజరు కావట్లేదని అన్నారు. జ్వరం కారణంగా తాను వెళ్లలేకపోతోన్నానని చెప్పారు. రెండురోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఇంద్రవెల్లిలో నిర్వహించ తలపెట్టిన దళిత-గిరిజన దండోరా సభకు హాజరుకావట్లేదని పార్టీ వర్గాలు చెబుతోన్నాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ఈ సభను విజయవంతం చేయడానికి కృషి చేశారు. జిల్లాస్థాయి నాయకులను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారిని సమన్వయం చేస్తూ.. జన సమీకరణ కోసం శ్రమించారు.

 పార్టీకి పూర్వవైభవం దిశగా..

పార్టీకి పూర్వవైభవం దిశగా..

ఏడేళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేకుండా నిరుత్సాహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి ఉత్సాహం నింపేలా, ప్రజలను భాగస్వామ్యులను చేసేలా బహిరంగ సభలను నిర్వహించడం పట్ల కొద్దిరోజుల్లోనే పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మొదట్లో రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించిన కొందరు సీనియర్లు కూడా ఇప్పుడు ఈ బహిరంగ సభ ఏర్పాట్లలో తలమునకలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని, పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకుని రావడానికి ఇదే సరైన సమయమని జగ్గారెడ్డి సూచించారు.

ఇంద్రవెల్లి సభ అజెండా ఏంటీ?

ఇంద్రవెల్లి సభ అజెండా ఏంటీ?

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయదలిచిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి దళితుడు, గిరిజనులు, ఆదివాసీలకు వర్తింపజేయాలనేది కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రధాన డిమాండ్. దీన్నే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇంద్రవెల్లి సభలో ప్రస్తావించనున్నారు. దీనితో పాటు ఎస్సీలకు ప్రకటించిన 10 లక్షల ఆర్ధిక సహాయంతో పాటు పోడుభూముల కేటాయింపుల్లో లబ్దిదారుల సంఖ్యను పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తోన్నారు. దీన్ని కూడా ఆయన దళిత-గిరిజన దండోరా సభలో ప్రస్తావిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

 టీఆర్ఎస్ ఏం చెబుతోంది?

టీఆర్ఎస్ ఏం చెబుతోంది?

కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ఇంద్రవెల్లి సభపై అధికార టీఆర్ఎస్ నాయకులు ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. దళితులు-గిరిజనులను దశాబ్దాల కాలం పాటు మోసం చేస్తూ వస్తోన్న కాంగ్రెస్ పార్టీకి.. వారి సంక్షేమ గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని మండిపడుతోన్నారు. అదే ఇంద్రవెల్లిలో 40 సంవత్సరాల కిందట కాంగ్రెస్‌ నెత్తుటి మరకలను మిగిలించిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదని అంటోన్నారు. ఎవరి కోసమైతే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇంద్రవెల్లి సభను నిర్వహించబోతోన్నారో.. అదే ఆదివాసీలు, గిరిజనులపై కాల్పులకు తెగబడిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని గుర్తు చేస్తోన్నారు. రాజకీయ లబ్ది కోసం లేని పోని అపోహలను కల్పిస్తోందని, దళిత, గిరిజనులకు తాము వ్యతిరేకం కాదంటూ, తన ఉనికిని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ ఉందని మండిపడుతోన్నారు.

హక్కులను అడిగితే కాల్పులు..

హక్కులను అడిగితే కాల్పులు..

పోడు భూములపై హక్కులు అడిగినందుకు ఆదివాసీలను పొట్టన పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ఆదివాసీల గురించి, వారి సంక్షేమం-అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అదే దళిత-గిరిజనులు, ఆదివాసీలను తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆదివాసీ నేతలను అరెస్టు చేసిన విషయాన్ని ఎవరూ విస్మరించబోరని అంటోన్నారు. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల త్యాగాలను కూడా తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటోందని విమర్శిస్తోన్నారు.

అడ్డుకోవడానికి ఆదివాసీ సంఃఘాలు

అడ్డుకోవడానికి ఆదివాసీ సంఃఘాలు

దళిత-గిరిజన దండోరా సభను టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు అడ్డుకోవడానికి అవకాశం ఉంది. దీనితో తుడుందెబ్బ ప్రతినిధులు కూడా ఈ సభ పట్ల అసంతృప్తిగా ఉంటోన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమను అణచివేయడానికి ప్రయత్నించిందని, ఇప్పుడు పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి కూడా తమను వినియోగించుకుంటోందనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ సభకు ఎవ‌రూ వెళ్లొద్ద‌ని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పిలుపునిస్తోన్నారు. కాంగ్రెస్ తమను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసే ప్రయత్నం చేస్తోందని, రాజకీయంగా ఎదగడానికి మరోసారి వంచన చేయడానికి పావులు కదుపుతోందని వారు మండపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+