IBomma Raviని పట్టించింది భార్య కాదు.. ఆ మెసేజ్..! పోలీసు విచారణలో..!
టాలీవుడ్ సినిమాల్ని పైరసీ చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటికి ఉచితంగా చేర్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఇమ్మడి రవికుమార్ (ఐబొమ్మ రవి)పై హైదరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రవిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు ఆయన నుంచి కీలక వివరాలు మాత్రం రాబట్టలేకపోయినట్లు సమాచారం. అందుకే మరోసారి రవిని కస్టడీకి ఇవ్వాలని కోరబోతున్నారు. అయితే ఈ కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఐబొమ్మ రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారన్న విషయం బయటికి వచ్చింది.
తొలుత పారిస్ నుంచి వచ్చిన ఐబొమ్మ రవిని తన భార్యే పోలీసులకు చెప్పి పట్టించినట్లు ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులతో పాటు అతని సన్నిహితులు కూడా ఖండించారు. మరి రవి ఇంత సులువుగా పోలీసులకు ఎలా చిక్కాడన్న దానిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. "మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం"అంటూ తన స్నేహితుడికి రవి పంపిన ఓ మెసేజ్ ఆయన్ను పోలీసులకు పట్టించినట్లు తేలింది.

సినిమాలు పైరసీ చేస్తున్న పలు వెబ్ సైట్లపై హైదరాబాద్ పోలీసులు ఎప్పటి నుంచో నిఘా పెట్టారు. ఈ కేసులో కొందరు అనుమానితుల్ని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఐబొమ్మ రవిని మాత్రం ఇంత సులువుగా పట్టుకుంటామని వారు కూడా అనుకోలేదు. కానీ రవిపై గట్టి నిఘా మాత్రం కొనసాగించారు. అదే సమయంలో తాజాగా ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చిన రవి.. "మామా హైదరాబాద్ వచ్చా..కలుద్దాం" అంటూ తన స్నేహితుడికి మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు.. రవి నగరానికి వచ్చినట్లు నిర్ధారించి, అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో ఇటీవలే పైరసీ నేరం కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట డొమైన్లు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఇదే క్రమంలో రవి విదేశాల్లో ఉంటూ, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి ఒక స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకుంటాడని గుర్తించారు. దీంతో రవి హైదరాబాద్ వస్తే చెప్పాలని అతని స్నేహితుడికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అతను రవి మెసేజ్ పెట్టగానే పోలీసుల్ని అలర్ట్ చేసి పట్టించాడు.
-
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!












Click it and Unblock the Notifications