వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ లో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో; రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార పర్వం పీక్స్ లో కొనసాగుతున్న సమయంలో ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలతో రాజకీయ పార్టీల నేతలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి లాభం ఏమిటి?

ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి లాభం ఏమిటి?

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మాట వాస్తవమే అయినా ఈ సమయంలో బిజెపి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పొలిటికల్ పార్టీల కదలికలపై అడుగడుగునా నిఘా ఉండగా బిజెపి నిజంగానే ఆ ప్రయత్నం చేసిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కేవలం నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టిఆర్ఎస్ పార్టీ పడిపోతుందా? ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉప ఎన్నికల్లో పొలిటికల్ గా ఏమైనా లాభం ఉంటుందా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి

ఆ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్లు పెట్టి కొనేంత ప్రాధాన్యత ఉందా?

ఆ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్లు పెట్టి కొనేంత ప్రాధాన్యత ఉందా?


ఇక బీజేపీ నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి 400 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, అంత భారీ రేట్లతో ఎందుకు ప్రయత్నించింది. ఇది నిజమేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్లు పెట్టి కొనేంత ప్రాధాన్యత ఉందా అన్నది కూడా ఒక ప్రశ్నే. అయితే బీజేపీలోకి ఎవరు రావాలన్నా రాజీనామా చేసిన తర్వాతే రావాలన్నా కండిషన్ ఉంది. మరి అలాంటప్పుడు నిజంగానే బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తే దాని వెనుక ఉన్న అసలు ఆంతర్యము ఏమిటి అన్నది కూడా పెద్ద ప్రశ్ననే.

నాటకీయ ఫక్కీలో సాగిన ఎపిసోడ్ లో అనేక అనుమానాలు

నాటకీయ ఫక్కీలో సాగిన ఎపిసోడ్ లో అనేక అనుమానాలు

ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చి, నలుగురికి అడ్వాన్స్ గా 15 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తే, ఎమ్మెల్యే లే తమను ట్రాప్ చేయడానికి బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పారని సమాచారం. ఇక పోలీసులు వచ్చిన తర్వాత ఈ కొనుగోలు వ్యవహారం తమకేమీ తెలియదని అక్కడి నుండి ఎంచక్కా ప్రగతి భవన్ కు వెళ్లి కూర్చున్నారు. నిజంగా ఎమ్మెల్యేలు పోలీసులను బిజెపి వారిని పట్టించాలని రమ్మంటే, అక్కడే ఉండి ఆ కేసు విషయంలో పోలీసులకు తగిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా నాటకీయ ఫక్కీలో మీడియాలో ముందే వీడియోలు రావడం, ఆ పై పోలీసులు దాడి చేయడం, అక్కడ నుండి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకోవడం ఏమిటి అన్నది ఆసక్తికర ప్రశ్నగా ఉంది. ఇంతకీ ఈ కేసులో ఇంతవరకు పోలీసులు డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూపించలేదు.

కిషన్ రెడ్డితో ఈ వ్యవహారానికి లింక్ పైనా అనేక ప్రశ్నలు

కిషన్ రెడ్డితో ఈ వ్యవహారానికి లింక్ పైనా అనేక ప్రశ్నలు

ఇక ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నట్టు, కిషన్ రెడ్డితో మాట్లాడారని చెబుతున్నట్టు జరుగుతున్న ప్రచారం పైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. చేరికల కమిటీకి బాధ్యుడు ఈటల రాజేందర్ అయితే కిషన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఆయన పేరు ఎందుకు చర్చనీయాంశంగా మారింది అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఇక బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నించిన నలుగురు ఎమ్మెల్యేల లో ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన పార్టీ నుంచి జంపు జిలాని అన్న వాళ్లే, ఇక అటువంటి వారికోసం స్వామీజీలు వందలకోట్ల నోట్ల కట్టలు తీసుకొని వస్తారా అన్నది కూడా ప్రశ్నగానే మారింది. 100 కోట్లు పెట్టి కొనేంత సీన్ ఆ ఎమ్మెల్యేలకు ఉందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆ స్వామీజీలు దొరికిన వెంటనే ఆసక్తికర ఫోటోలు.. వీడియోలు.. ఇది ప్రీ ప్లాన్ నా?

ఆ స్వామీజీలు దొరికిన వెంటనే ఆసక్తికర ఫోటోలు.. వీడియోలు.. ఇది ప్రీ ప్లాన్ నా?

ఇక పోలీసులకు దొరికిన స్వామీజీలు బీజేపీకి సన్నిహితులు అని చెప్పడం కోసం టిఆర్ఎస్ సోషల్ మీడియా, మీడియా బోలెడన్ని ఫోటోలను, వీడియోలను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఇంత తక్కువ సమయంలో జరగడం అంటే, ఇది ప్రీ ప్లాన్డ్ వ్యవహారమా అన్నది కూడా ప్రశ్నగా మారింది. ఏదిఏమైనా ఈ కేసుకు సంబంధించి బోలెడన్ని ప్రశ్నలు రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర ప్రజల లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.

ఇక్కడ బీజేపీ ఆటలు సాగవు; ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై విరుచుకుపడిన తెలంగాణా మంత్రులుఇక్కడ బీజేపీ ఆటలు సాగవు; ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై విరుచుకుపడిన తెలంగాణా మంత్రులు

English summary
There are many unsolved questions in the dramatic episode of TRS MLA purchases, and there is an interesting discussion in the political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X