టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీజేపీ పిటీషన్ ఎందుకు వేసింది? సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదన!!
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ కేసును జస్టిస్ బి వీ నాగరత్న, జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.

సుప్రీం కోర్టులో నిందితుల తరపున న్యాయవాది వాదన ఇలా
సుప్రీంకోర్టులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది కే విశ్వనాథన్ పిటిషనర్ల తరఫున తన వాదన వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూధ్రా కూడా ప్రభుత్వం తరపు వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కే వి విశ్వనాథన్ ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసులలో, 41 ఎ నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు నిఘా వర్గాలకు కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారు ప్లాన్ చేసి మరీ ట్రాప్ చేశారని పేర్కొన్నారు. నిందితులను కావాలని ట్రాప్ చేశారని పేర్కొన్నారు.

బీజేపీ ఈ కేసుపై కోర్టును ఆశ్రయించటాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం తరపు న్యాయవాది
ఇక దీనిపై వాదించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ కేసు దర్యాప్తు పై స్టే కోరుతూ బిజెపి హైకోర్టును ఆశ్రయించింది అని వాదించారు. ఈ వాదన విన్న సుప్రీం ధర్మాసనం ఓ రాజకీయ పార్టీ ఈ కేసుపై స్టే విధించాలని ఎందుకు పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు దానిని ఎలా విచారణకు స్వీకరించింది అని ప్రశ్నించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బీజేపీ వేసిన పిటిషన్ కు తమకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్న పోరులో తమ నలిగిపోతున్నామని, ఎవరో పిటిషన్ దాఖలు చేస్తే తమను నిందిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు.

ఈ కేసులో పిటిషన్ దాఖలు చేయడానికి బీజేపీకి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ఇక అలాంటప్పుడు ఈ కేసుపై స్టే విధించిన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి బీజేపీ ఎవరిని ప్రభుత్వ న్యాయవాది లూధ్రా పిటిషనర్ తరఫు న్యాయవాదికి కౌంటర్ వేశారు. ఆపై జోక్యం చేసుకున్న జస్టిస్ బి ఆర్ గవాయ్ పిటిషన్ దాఖలు చేయడానికి బీజేపీకి ఉన్న అర్హత ఏమిటని హైకోర్టు ప్రశ్నించాలని ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ కేసులో డబ్బు కూడా స్వాధీనం కాలేదు కదా.. ట్రాప్ కేసుల్లో నిందితులను సాధారణంగా అదే రోజు విడుదల చేస్తారు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే నేరం చేశారని భావిస్తే పోలీసులు అరెస్టు చేయవచ్చని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

విచారణ సోమవారానికి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
ఇక హైకోర్టులో జరిగిన విచారణ గురించి సుప్రీం ధర్మాసనం అడిగి తెలుసుకుంది. హైకోర్టు బిజెపి వేసిన పిటిషన్లో స్టే విధించి తమ చేతులను కట్టి వేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక వాదోపవాదాలు అనంతరం సుప్రీం ద్విసభ్య ధర్మాసనం నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టడానికి, సుప్రీంకోర్టు తోపాటు హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లో ఏ మాత్రం అడ్డంకి కాదని, నిబంధనల ప్రకారం విచారణ చేపట్టవచ్చని పేర్కొంది. ఇక ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అయితే తాము దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్ ను పరిశీలించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది పదే పదే విజ్ఞప్తి చేసినా సుప్రీం ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ఇక ఇలాగే కోరితే నిందితులకు బెయిల్ ఇస్తామంటూ ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని హెచ్చరించింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications