• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

28న 4 కొత్త పాలసీలు: 'తుఫాన్లు, వరదలు లేని అద్భుతమైన ప్రాంతం హైదరాబాద్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశానికే ఐటి కేంద్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. మాదాపూర్‌‌లో శనివారం సాఫ్ట్‌వేర్ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) ఏర్పాటు చేసిన ఇమేజ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ రంగాల్లో ఆవిష్కరణలకు, కొత్త కంపెనీల ఏర్పాటుకు ప్రోత్సాహానికి ఈ కేంద్రం ఏర్పాటైందన్నారు. తుఫాన్లు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల భయంలేని అద్భుత ప్రాంతం హైదరాబాద్ అన్నారు.

హైదరాబాద్‌ను ఐటి రంగానికి చిరునామాగా మారుస్తామన్నారు. దేశంలో మరే ప్రాంతంలోనూ లేనివిధంగా హైదరాబాద్ సౌకర్యవంతమైన ప్రాంతమన్నారు. ఈనెల 28న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్‌కు వస్తున్నారని కెటిఆర్ తెలిపారు. టి-హబ్‌లోని స్టార్టప్‌లను పరిశీలిస్తారని, వారితో చర్చిస్తారని కెటిఆర్ తెలిపారు.

28న తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగానికి సంబంధించి నాలుగు పాలసీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ పాలసీల ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాకుండా హార్డ్‌వేర్ రంగంలోనూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనేది లక్ష్యమన్నారు. ఐటి పాలసీ, గేమింగ్ పాలసీ, హార్డ్‌వేర్ పాలసీ, ఇమేజ్ పాలసీలను 28న ప్రకటించనున్నట్టు చెప్పారు.

పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, హైదరాబాద్‌ను ఐటి రంగంలో దేశానికే కేంద్రంగా మార్చడం లక్ష్యమన్నారు. ఏరోస్పేస్ ఇంక్యూబేషన్‌పై సిఎం దృష్టి సారించారని తెలిపారు. తెలంగాణలో పలు పరిశ్రమలు రానున్నాయని, వీటివల్ల ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు.

28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్

28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్


ప్రైవేటు రంగం, ప్రభుత్వం పరస్పర సహకారంతో ఐటి రంగం అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఇమేజ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశంలోనే అత్యంత సురక్షితమైన హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

 28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్

28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్


ఈ క్రమంలోనే గేమింగ్ అనే పదాన్ని ఇమేజ్ (ఇన్ఫర్మేషన్ ఇన్ మల్టీ మీడియా యానిమేషన్ గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్)గా మంత్రి కేటీఆర్ పునర్నిర్వచించారు. ఇకనుంచి గేమ్‌సిటీ అని కాకుండా ఇమేజ్ ఇంక్యుబేటర్ అని లకాలని కోరారు. హైదరాబాద్ నగరం ఐటీ, అనుబంధ పరిశ్రమలకు అత్యంత అనువైన ప్రాంతమన్నారు.

28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్

28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్


యానిమేషన్‌లో ప్రఖ్యాత చోటాబీమ్ పాత్ర సృష్టికర్త రాజీవ్ చిలుకాను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. చోటాబీమ్‌తో పిల్లలు మైమరచిపోతున్నారన్నారు. తమ పిల్లలు సైతం ఈ గేమ్ ఆడటంలో సంబరపడుతున్నారని చెప్పారు. ఈ ఆటలో పడి ఒక్కోసారి స్కూలుకు వెళ్లం అంటూ మారాం చేస్తున్నారని చమత్కరించారు. చోటాబీమ్ సృష్టికర్తలు మరిన్ని ఆవిష్కరణలతో ప్రత్యేక గుర్తింపును సాధించి హైదరాబాద్‌కు పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.

 28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్

28న 4 కొత్త పాలసీలు: మంత్రి కేటీఆర్


ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ... స్టార్టప్‌ల క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. ఎస్‌టీపీఐ డైరెక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ యువ ఔత్సాహికులకు ఈ కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు లక్ష్మీకాంత్ రెడ్డి, బసిరెడ్డి, టీ హబ్ సీఈవో శ్రీనివాస్ కొల్లిపార తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana government is planning to launch four new policies on December 28 coinciding with the visit of Microsoft chief to T-Hub, the new start-up incubator established at IIIT-Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X