హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారై రమ్యకృష్ణ మృతి కేసులో ఇద్దరి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఎన్నారై రమ్యకృష్ణ మృతి కేసులో హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో నివసించే రమ్యకృష్ణ నెలకిందట అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. భర్తతో పాటు అత్తమామలు ఆమె మృతికి కారణమంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నారై భర్త నిర్వాకం: రమ్య శవాన్ని ఎయిర్‌పోర్టులో వదిలేసి వెళ్లిపోయాడు

ఈ కేసులో వరంగల్‌కు చెందిన సుగుణ, సుబ్రమణ్యంలను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు, అత్తామామలు డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ భజంగరావు తెలిపారు.

nri

ఆస్ట్రేలియాలో రమ్యకృష్ణ మృతి: భర్తే కారణమని ఆరోపణలు

రమ్యకృష్ణ భర్త మహంత్‌ను కూడా ఆస్ట్రేలియా నుంచి రప్పించి అరెస్ట్‌ చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అప్పట్లో రమ్య తల్లిదండ్రులు అన్నారు. చాలా ధైర్యవంతురాలని, కష్టాలకు అధైర్యపడదన్నారు. కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదం జరిగిందని, అప్పుడు కూడా ఆమె ధైర్యంగా ఉందని తల్లి చెప్పారు. తన కూతురు మృతికి కారణమైన వారిని శిక్షించాలన్నారు.

ఎన్నారై భర్త నిర్వాకం: 'రమ్య ఇషయూలో ఆ 2 గంటల్లో ఏదో జరిగింది!' (పిక్చర్స్)

తన కుమార్తె మృతదేహం ఇచ్చేంత వరకు తమను మహంత్ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారని రమ్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మహంత్ తండ్రి చెప్పాడు. భార్యాభర్తల మధ్య గొడవల్లేవన్నరు. కావాలనే తన కొడుకు పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో తల్లిదండ్రులకు అప్పగించి మహంత్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

English summary
Hyderabad Kukatpally police arrested two persons from Warangal in NRI woman Ramya Krishna death case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X