మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ అవుతుందా? నల్గొండ జిల్లాలో ఆసక్తికర చర్చ!!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారనుందా? మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా? మునుగోడు నియోజకవర్గానికి నిధుల వరద కురిపించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తారా? మంత్రి జగదీశ్ రెడ్డి ఆ పనుల్లో నిమగ్నం అయ్యారా? అన్నది ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధిపై టీఆర్ఎస్ ఫోకస్
మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ నిధులు కేటాయించలేదని గత కొంతకాలంగా మునుగోడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని బాహాటంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నకారణంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే నియోజకవర్గ అభివృద్ధిని చూపించాల్సిన అవసరం ఉంది.

హుజురాబాద్ తరహాలో మునుగోడులో నిధుల వరద కురిపించటానికి టీఆర్ఎస్ ఫోకస్
ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గానికి ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులను ఇప్పుడు విడుదల చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నట్లుగా నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఈటల రాజేందర్ ను ఓడించడం కోసం టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నిధుల వరద కురిపించింది. పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. అయినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ కు పట్టం కట్టారు. ఇక తాజాగా మునుగోడు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిపై దృష్టి సారించబోతున్న టిఆర్ఎస్ ఇకపై వేగంగా నిధులు మంజూరు చేయాలని భావిస్తోంది. అయితే హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలినట్టు, మునుగోడులో తగలబోదని గట్టి నమ్మకంతో ఉంది.

మునుగోడు అభివృద్ధికి 33.20 కోట్ల నిధులు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలోనూ సీఎం కేసీఆర్ ప్రకటించిన నిధులు మునుగోడుకు ఇప్పటివరకు మంజూరు కాలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినందుకు నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి 30 లక్షలు, అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి ప్రకటన మేరకు 844 గ్రామ పంచాయతీలకు 168. 80 కోట్లు, 31 మండలాలకు 9.30 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఇక దీనిలో మొత్తం మునుగోడు నియోజకవర్గం లోని 157 గ్రామ పంచాయతీలు 6 మండల కేంద్రాలకు 33.20 కోట్ల విడుదల చేయాల్సి ఉంది కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి.

నియోజకవర్గానికి నిధులను విడుదల చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పనుల ప్రతిపాదనలు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి పంపాలని సూచించడంతో, ఆయనకు పంపడం ఇష్టం లేక తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక జిల్లా అధికార యంత్రాంగాన్ని కలిసినా పని జరగకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే విషయాన్ని అక్కడితో విరమించుకున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో నియోజకవర్గానికి కేటాయించిన నిధులను విడుదల చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది.

ప్రతిపాదనలు తెప్పించుకుంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. జిల్లాలో ఆసక్తికర చర్చ
ఈ మేరకు ప్రతిపాదనలు మంత్రి జగదీష్ రెడ్డి తెప్పించుకున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నచోట, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిపాదనలు పంపించాలని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా చేయవలసిన పనులకు సంబంధించిన వివరాలను తెప్పించుకుంటూ జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం పై పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, హుజురాబాద్ నియోజకవర్గ తరహాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుణ్యాన జరుగుతుందేమో అన్న చర్చ స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications