రైలులో గర్బిణీ డెలివరీ, పండంటి బిడ్డ జననం: ఫోటో పోస్ట్ చేసిన పీయూష్, నెటిజన్ల ప్రశంసలు..
ఆమె నిండు చులాలు.. రేపో, మాపో అనగా డెలివరీ. కానీ సికింద్రాబాద్- హౌరా స్పెషల్ ట్రైన్లో ప్రయాణిస్తోంది. నొప్పులు రావడంతో రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైల్వై వైద్యులు వచ్చి.. గర్భవతిని డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రసవానికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఈ నెల 24వ తేదీన గర్భవతికి రైల్వే వైద్యులు ప్రసవం చేశారని ఆయన తెలిపారు. బాలింత, అప్పుడే పుట్టిన మగ బిడ్డ ఫోటోను కూడా షేర్ చేశారు పీయూష్ గోయల్. ప్రపంచంలోకి అడుగిడిన చిన్నారికి భారతీయ రైల్వే స్వాగతం చెబుతోంది అని పీయూష్ పేర్కొన్నారు.

దీనికి నెటిజన్లు కూడా స్పందించారు. హ్యాట్సాప్ రైల్వే డాక్టర్స్ అంటూ అభినందనలు తెలిపారు. గుడ్ జాబ్ అని కొందరు, సెల్యూట్ ఇండియన్ రైల్వే అని మరికొందరు కామెంట్ చేశారు. మంచి టీం వర్క్‌తో గర్భిణీకి డెలివరీ చేసినందుకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరోవైపు ఈ నెల మొదటివారంలో కూడా ఒక డెలివరీ జరిగింది. శ్రామిక్ రైలులో కేరళ నుంచి అసోం గోల్ ఘాట్ వస్తున్న.. గర్బిణీ కూడా శ్రామిక్ రైలులో డెలివరీ అయ్యింది. మరో కంపార్ట్ మెంట్లో ఉన్న మహిళ సాయంతో డెలివరీ జరిగింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications