వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రగతిభవన్, కవిత, కేటీఆర్ ఇళ్లపైనా రైడ్స్ చేస్తే వేలకోట్లు దొరుకుతాయి: వైఎస్ షర్మిల షాకింగ్ డిమాండ్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా తన పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైయస్ షర్మిల కెసిఆర్ కుటుంబం పై సంచలన ఆరోపణలు చేశారు.

గవర్నర్ తమిళిసైతో వైఎస్ షర్మిల భేటీ.. పోలీసులపై ఫిర్యాదు; వినతిపత్రం!!గవర్నర్ తమిళిసైతో వైఎస్ షర్మిల భేటీ.. పోలీసులపై ఫిర్యాదు; వినతిపత్రం!!

దేశంలో అత్యంత ధనవంతమైన కుటుంబం కేసీఆర్ కుటుంబం

దేశంలో అత్యంత ధనవంతమైన కుటుంబం కేసీఆర్ కుటుంబం

కెసిఆర్ డైరెక్షన్లోనే తన పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని, దాడులు జరిపారని వైయస్ షర్మిల ఆరోపించారు. తనకు ప్రజల్లో వస్తున్న మద్దతు గురించి కేసీఆర్ కు సర్వే రిపోర్ట్ అందిందని అందుకే తన పాదయాత్రను అడ్డుకోవడానికి విఫలయత్నాలు చేస్తున్నారన్నారు. తనను అరెస్టు చేస్తే పాదయాత్ర ఆగుతుందని భావించి అరెస్టుకు పాల్పడ్డారని, అరెస్టు చేసిన తమ వాళ్లను పోలీసులు ఇష్టమొచ్చినట్టుగా కొట్టారని వైయస్ షర్మిల ఆరోపించారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఎక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదని పేర్కొంది షర్మిల, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే సృష్టించి తన పాదయాత్రను అడ్డుకునే కుట్ర చేశారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబం కెసిఆర్ కుటుంబమని వైఎస్ షర్మిల విమర్శించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు; కవిత, కేటీఆర్ ఇళ్ళపై రైడ్స్ చెయ్యాలి

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు; కవిత, కేటీఆర్ ఇళ్ళపై రైడ్స్ చెయ్యాలి


కెసిఆర్ కుటుంబానికి వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని కవిత ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు ఉందని పేర్కొన్న వైయస్ షర్మిల వేల కాంట్రాక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో రైడ్స్ చేసే వేల కోట్ల రూపాయలు దొరుకుతాయని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ పని చేయాలని వైఎస్ షర్మిల సూచించారు. కవిత, కేటీఆర్ ఇళ్లపై దాడులు చేయాలని వైయస్ షర్మిల పై తెలిపారు. కెసిఆర్ కుటుంబ అవినీతిపై అన్ని రకాల విచారణలు జరగాల్సిన అవసరం ఉందని వైయస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు .

ఓ నికృష్ట మంత్రి మరదలంటే చెప్పుతో కొడతా అన్నా తప్పేంటి

ఓ నికృష్ట మంత్రి మరదలంటే చెప్పుతో కొడతా అన్నా తప్పేంటి


తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిపైనా విచారణ జరగాలని కవిత డిమాండ్ చేశారు . ఓ నికృష్ట మంత్రి మరదలు అన్నాడు కనుక తను చెప్పుతో కొడతానని మాట్లాడానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై వ్యక్తిగతంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్న వైయస్ షర్మిల, అలా వ్యక్తిగత విమర్శలు చేసినట్టుగా ఏదైనా వ్యాఖ్యల వీడియో ఉంటే చూపించాలన్నారు. ఆయన మగతనం గురించి తను మాట్లాడలేదని, ఆయన మగతనం తో తనకేం పని అని పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అని ఎల్ఐసి ఏజెంట్ అని అన్నానని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?


తాము కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నామని, పాదయాత్ర మళ్లీ మొదలు పెడతాం అని చెప్పిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేసే దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక ఈ సమయంలో ఎక్కడలేని కొత్త సమస్యను తీసుకువస్తున్నారని, తనను ఆంధ్ర అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్న వైఎస్ షర్మిల కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించారు.. ఆమె ఆంధ్రా ఆవిడ కాదా? తాము ఆవిడను గౌరవించటం లేదా? మేమేమైనా విడాకులు తీసుకోమని అడిగామా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ భార్య తెలంగాణ అయితే, తాను తెలంగాణ కాకుండా ఎలా పోతాను అంటూ ప్రశ్నించారు, మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారమా అని వైఎస్ షర్మిల నిలదీశారు.

 తన గతం ఇక్కడే .. భవిష్యత్ ఇక్కడే అన్న షర్మిల

తన గతం ఇక్కడే .. భవిష్యత్ ఇక్కడే అన్న షర్మిల


ఇక్కడే పెరగానని, ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెళ్లి చేసుకుని, ఇక్కడే కొడుకుని కని, ఇక్కడే బతుకుతున్నా అని, తన గతం తో పాటు తన భవిష్యత్తు కూడా ఇక్కడే ఉందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. రేపు తమ పాదయాత్ర మొదలవుతుంది అని చెప్పిన వైఎస్ షర్మిల తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. తమకు, తమ వాళ్లకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆఫ్గనిస్తాన్ గా మారిందని పేర్కొన్న వైయస్ షర్మిల కెసిఆర్ తాలిబన్ నాయకుడు అంటూ విమర్శించారు. ఉద్యమకారులను తరిమేసి పార్టీలో తాలిబన్లను చేర్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ కోవర్టు వ్యాఖ్యలను తిప్పికొట్టిన షర్మిల

బీజేపీ కోవర్టు వ్యాఖ్యలను తిప్పికొట్టిన షర్మిల

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జి లకు తెలియజేసేలా లేఖ రాశానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. అంతేకాదు బిజెపి కోవర్టు అంటూ తనపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ షర్మిల అలా అయితే పాదయాత్ర చేసి ఇంతగా కష్టపడే దాన్ని కాదని సమాధానం చెప్పారు. తాను పాదయాత్ర చేసి ఇంకో పార్టీకి మైలేజీ ఎందుకు ఇస్తా అంటూ ప్రశ్నించారు. గతంలో కెసిఆర్, కేటీఆర్ బూతులు మాట్లాడారని విమర్శించిన వైయస్ షర్మిల దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించి కేసీఆర్, కేటీఆర్ ల పై నిప్పులు చెరిగారు.

English summary
Investigating agencies want to uncover the corruption of KCR's family. YS Sharmila who says that thousands of crores will be found if raids are done at Pragati Bhavan and raids are also done on Kavitha and KTR's houses. She said that Kavitha is in the Delhi Liquor scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X