వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీది ఓ గెలుపేనా? సిగ్గుండాలి కేసీఆర్; బీజేపీకి బుద్దొచ్చిందా: మునుగోడు ఫలితాలపై వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. మునుగోడులో మొనగాడు మేమే అని సంబరాలు జరుపుకున్న టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేశారు. అదే సమయంలో బీజేపీని సైతం టార్గెట్ చేసి వైయస్ షర్మిల తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

 గెలిచామని సంబరాలు చేసుకోడానికిసిగ్గుండాలి : వైఎస్ షర్మిల

గెలిచామని సంబరాలు చేసుకోడానికిసిగ్గుండాలి : వైఎస్ షర్మిల

ఊరికో ఎమ్మెల్యేను పెట్టి, మండలానికి ముగ్గురు మంత్రులను పెట్టి రాజకీయాలు చేశారని మండిపడ్డారు. మద్యం, మనీ పంచి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్లను బెదిరించి, ఫామ్ హౌస్ డ్రామా ఆడి.. కేవలం 10వేల ఓట్లతో గెలిచిన ఎన్నిక గెలుపేనా? అంటూ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి, గెలిచామని సంబరాలు చేసుకోడానికి కెసిఆర్ గారికి సిగ్గు ఉండాలి కదా అంటూ వైయస్ షర్మిల చురకలంటించారు.

బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు

బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు

ఇక ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదేనని చెబుతున్న బిజెపి నాయకులను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా? ప్రశ్నించారు. దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని బుద్ధి వచ్చిందా? అంటూ వైయస్ షర్మిల బిజెపి ని టార్గెట్ చేశారు.

బెల్లంపల్లి పాదయాత్రలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల


ప్రజాప్రస్థానం పాదయాత్రలో బెల్లంపల్లి నియోజకవర్గం లో పర్యటించిన వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ నాడు బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, బెల్లంపల్లిలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను గుర్తుచేసి టార్గెట్ చేశారు. సింగరేణి కార్మికులకు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 30వేల ఇండ్లపట్టాలిస్తే.. కెసిఆర్ 10వేల మందికి ఇండ్ల పట్టాలు, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల రుణాలు ఇస్తానని మోసం చేశాడని విమర్శించారు. ఉద్యమంలో ఓపెన్ కాస్టులు లేకుండా చేస్తానని చెప్పి, నేడు ఓపెన్ కాస్టులు పెంచి అండర్ గ్రౌండ్ మైన్ లు తగ్గించాడు అని కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

కేసీఆర్ గారడీ మాటల వీడియోని టార్గెట్ చేసిన షర్మిల


బెల్లంపల్లి గడ్డపై కేసీఆర్ గారడి మాటలు చెప్పి మోసం చేశారని, కెసిఆర్ మాట్లాడిన నాటి వ్యాఖ్యలను టార్గెట్ చేశారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగానూ పోస్ట్ చేశారు. ఎన్నికలు అయిపోగానే సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలిస్తా.. నేనే ఫ్రీగా కూర్చుని నా చేతుల్తోనే పట్టాలిస్తా. తుమ్మిడిహెట్టి నిర్మించి 200 చెరువులు నింపుతా అన్ని వ్యాఖ్యలు చేస్తారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. బెల్లంపల్లికి 50 వేలు, 60వేల ఎకరాలకు నీళ్లిస్తా అని చెప్పిన దొర మీ హామీలు ఎక్కడికి పోయాయి అంటూ వైయస్ షర్మిల సూటి ప్రశ్న వేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యేపై వైఎస్ షర్మిల ఆరోపణలు

అంతేకాదు బెల్లంపల్లి ఎమ్మెల్యే ను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య అభివృద్ధి వదిలి.. అవినీతిలో ఆరితేరాడు అని విమర్శించారు. సింగరేణి భూముల్ని కూడా కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీ, మైనింగ్ కాలేజీ, మండలానికో ఇంటర్ కాలేజీ, మ్యాంగో మార్కెట్ తీసుకొస్తానని చెప్పి నిండా మోసం చేశాడని వైయస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యేను సైతం టార్గెట్ చేశారు.

English summary
YS Sharmila made sensational comments on the results of the munugode by-elections. She targeted the TRS party saying that the victory achieved by luring the voters and murdering democracy is a victory?. She questioned whether the BJP realized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X