తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్బో... టీటీడీ ఒక మంచి నిర్ణ‌యం తీసుకుంద‌య్యా..!!

|
Google Oneindia TeluguNews

భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాలను అందజేయాలని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిర్ణ‌యించింది. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో భాగంగా ఫోన్లు చేసిన భ‌క్తులు కూడా అన్న ప్ర‌సాదానికి సంబంధించే ఎక్కువ‌గా ఫిర్యాదులు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు తాము శుచిగా, రుచిగా అన్న‌ప్ర‌సాదాన్ని అందిస్తున్నామ‌ని, బియ్యంలో నాణ్య‌త పెంచేందుకు త‌ప్ప‌నిస‌రిగా మిల్ల‌ర్ల‌తో మాట్లాడ‌తామ‌ని ఈవో విశాఖపట్టణం నుంచి ఫోన్ చేసిన వెంకటరమణకు హామీ ఇచ్చారు.

లడ్డూలు పొందడానికి గంటన్నర పడుతోంది!

లడ్డూలు పొందడానికి గంటన్నర పడుతోంది!

తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ప్రసాదాలు తీసుకోవడానికి గంట‌న్న‌ర సమయం పడుతోందని, అన్ని కౌంటర్లు పనిచేసేలా చూడాలని బెంగళూరుకు చెందిన వెంకటేష్‌ కోరారు. అలాగే కొండ‌పై శ్రీవారి బంగారు డాలర్లు 10 గ్రాములు, రెండు గ్రాములు మాత్రమే ఉన్నాయ‌ని, ఈ-దర్శన్‌ కౌంటర్లు తిరిగి ప్రారంభించాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు పొందిన వారికి అదే రోజు గదులు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని వరంగల్‌కు చెందిన మురళీధర్‌, హైదరాబాద్‌కు చెందిన సీత కోరారు. క్యూలైన్‌లో దళారులు అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నారని ఈవో దృష్టికి తెచ్చారు. కొండ‌పై హోటళ్లలో టిఫిన్‌ ధరలు తగ్గించాలని సత్యవేడుకు చెందిన అనిల్‌రెడ్డి కోరారు.

సేవ చేయాలంటే రూ.400 తీసుకుంటున్నారు!

సేవ చేయాలంటే రూ.400 తీసుకుంటున్నారు!

శ్రీవారి సేవకు ఒక్కొక్కరి వద్ద రూ.400 వసూలు చేస్తున్నారని కరీంనగర్‌కు చెందిన మహేందర్‌రావు ఆరోపించారు. ఆన్‌లైన్‌లో నేరుగా బుక్‌చేసుకునే సదుపాయం కల్పించామ‌ని, స్వామివారికి సేవ చేసుకునేందుకు దళారులకు సేవ‌కులు డబ్బులివ్వకూడదని ఈవో సమాధానం ఇచ్చారు. సేవ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఆన్ లైన్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

వీఐపీ దర్శనాలు రద్దుచేయాలి?

వీఐపీ దర్శనాలు రద్దుచేయాలి?


వీఐపీ దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని, వీఐపీ దర్శనాలవల్ల సాధారణ భక్తుల దర్శనం ఆలస్యమవుతోందని, సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని మడకశిరకు చెందిన రామకృష్ణ చెప్పారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహకిషోర్, తితిదేకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు

English summary
Tirumala Tirupati Devasthanam has decided to provide delicious and quality Annaprasad to the devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X