విశాఖపై జగన్ ఇంటర్నేషనల్ స్కెచ్ - సక్సెస్ అయితే తిరుగేలేదు..!!

విశాఖపట్నం: రాష్ట్రానికి భవిష్యత్ పరిపాలన రాజధానిగా మారే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తోన్న విశాఖపట్నంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ సాగరం నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకుని వచ్చేలా భారీ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. దేశ, విదేశీ ప్రముఖులను రప్పించబోతోన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల సదస్సు 2023ని వైఎస్ జగన్ దీనికి వేదికగా మలచుకున్నారు.

మార్చిలో..

మార్చిలో..

విశాఖపట్నంలో వచ్చే మార్చి 3,4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించబోతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టింది. రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహింపజేసేలా భారీఎత్తున ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలు పెట్టింది. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ దీనికి భాగస్వామి.

అన్ని రంగాలకు..

అన్ని రంగాలకు..

ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్‌ తదితర కంపెనీలతో పాటు మరిన్ని రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా రంగాల్లో టాప్ కంపెనీలను ఏపీికి రప్పించే ప్రయత్నాల్లో ఉంది.

హేమాహేమీలకు ఆహ్వానం..

హేమాహేమీలకు ఆహ్వానం..

ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించింది. ఈ మేరకు వారికి దశలవారీగా ఆహ్వాన పత్రాలను పంపిస్తోంది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ కు ఆహ్వానపత్రాన్ని పంపించనుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, అపర కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను ఆహ్వనించనుంది జగన్ ప్రభుత్వం.

సుందర్ పిచాయ్.. సత్యనాదెళ్ల

సుందర్ పిచాయ్.. సత్యనాదెళ్ల

టాప్ సెర్చింజిన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, చీఫ్ సత్య నాదెళ్ల పేర్లను కూడా జగన్ ప్రభుత్వం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అధినేత, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ ఈ జాబితాలో ఉన్నారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్ చంద్రశేఖరన్ వంటి దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు.

కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు..

కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు..

ఈ గ్లోబల్ సమ్మిట్ కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా వైఎస్ జగన్ ఆహ్వానించనున్నారు. 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రాలను పంపించనున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు శాఖలకు చెందిన 15 మంది కేంద్రమంత్రులు, వివిధ దేశాల రాయబారుకు ఇందులో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్ టైల్స్, సముద్ర రవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రూపొందిం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+