నటి రంజితతో రాసలీలలు నడుపుతూ పట్టుబడిన స్వామి నిత్యానంద మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానంద స్వామిపై ఓ ఎన్నారై అమెరికాలోని కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు. తెలిసిన వివరాల ప్రకారం - పపట్‌లాల్ అనే ఎన్నారై నుంచి నిత్యానంద స్వామి మిలియన్ డాలర్లు విరాళంగా తీసుకున్నాడు. అమెరికాలో ఓ అశ్రమాన్ని, వేద విశ్వవిద్యాలయాన్ని, ఓ ఆలయాన్ని నిర్మిస్తానని నిత్యానంద స్వామి ఆ ఎన్నారైకి హామీ ఇచ్చాడట. ఆ హామీలను నెరవేర్చకపోగా, తన డబ్బులు ఏమయ్యాయో తెలియక ఎన్నారై నిత్యానంద స్వామిపై కోర్టుకెక్కాడని సమాచారం.
నిత్యానంద స్వామి తీసుకున్న మిలియన్ డాలర్ల విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయల మేరకు ఉంటుందని ఓ అంచనా. ఆ డబ్బుల గురించి అడిగితే నిత్యానంద స్వామి మొహం చాటేస్తున్నాడట. పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న నిత్యానంద స్వామికి ఇది మరో ఎదురుదెబ్బగానే చెప్పాలి.