బహరేన్‌లో గుండెపోటుతో మృతి: స్వగ్రామానికి మృతదేహం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని మెండోరా గ్రామానికి చెందిన అల్లెపు గంగారాం మృతదేహాన్ని ఎన్నారైలు స్వగ్రామానికి పంపించారు. ఆయన ఈ జులైలో బహరేన్ కు వచ్చాడు. ఇంతలోనే దురదృష్టవశాత్తు నవంబర్ 26 ఆదివారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు.

అతనికి తల్లి, తండ్రి, భార్యతో పాటు నలుగురు ఆడ పిల్లలున్నారు. ఆ తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, భర్తను పోగొట్టుకున్న భార్య పెడుతున్న రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే విషయాన్ని బంధువులు గంగరాజం, రాజన్న, నర్సయ్య ఎన్నారై టీఆరెస్ సెల్ సభ్యుల దృష్టికి తీసుకుని వచ్చారు.

Gangaram dead body sent to his village

వెంటనే స్పందించిన టిఆర్ఎస్ ఎన్నారె సెల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, అతని కంపెనీ యజమాని/అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాటు చేశారు. మృతిచెందిన 11 రోజుల తర్వాత బుధవారం రోజు గల్ఫ్ఎయిర్ ప్లయిట్‌లో పంపించారు.
శంషాబాద్‌కు వచ్చిన మృతదేహాన్ని విమానాశ్రయం నుండి స్వగ్రామానికి రవాణా చేయడానికి టీఆర్ఎస్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, బాబురావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

Gangaram dead body sent to his village

మృతిచెందిన బాదిత కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ తరపున తమ వంతు సహాయాన్ని తొందరలోనే అందిచి ఆదుకుంటామని వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి తెలిపారు. వారి ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, రాజేంధార్, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, నర్సయ్య, సాయన్న, ప్రమోద్, సిహెచ్ రాజేందర్, భజన్న, వినోద్, వసంత్, శంకర్, రాజు, వెంకటేష్, రాంబాబు, బుచ్చిరెడ్డి, శేఖర్ తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dead in Bahrain, Gangaram body has been sent his village in Nizamad district of Telangana by NRI TRS Cell.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి