• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డాలస్‌లో వన భోజనాలు.. ఆట, పాటలతో హోరెత్తిన ప్రాంగణం..

|
Google Oneindia TeluguNews

ఖండంతరాల్లో కూడా అచ్చ తెలుగు సాంప్రదాయాలు కంటిన్యూ చేస్తున్నారు. సందడిగా బతుకమ్మ ఆడతారు. వన భోజనాలు కూడా నిర్వహిస్తారు. తెలుగువారి వనభోజనం డాలస్‌లో సందడి చేసింది. ప్రకృతి ఒడిలో ఆటలాడారు. వేలాదిమందితో బతుకమ్మ పండుగను విశేషంగా నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. అర్గిల్‌లోని పైలట్‌నాల్‌ పార్క్‌లో ఆదివారం టీపాడ్‌ వన భోజనాలు నిర్వహించింది.

 అదిరిన డ్యాన్స్..

అదిరిన డ్యాన్స్..

డాలస్‌, టెక్సాస్‌ పరిధిలో ఉంటున్న మూడు వేల మంది తెలుగువారు హాజరై వంటకాలను రుచి చూసి మైమరిచిపోయారు. వేడుక ఆరంభంలో స్థానిక కళాకారుల బృందం 'డాలస్‌ పరై కుజు' ప్రదర్శించిన డప్పు డ్యాన్స్‌ ఆకట్టుకుంది. తెలుగు వారందరూ ఫ్లాష్‌మాబ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు పతంగులను ఎగురవేశారు. లెమన్‌ స్పూన్‌ తదితర ఆటలను ఎంజాయ్‌ చేశారు. పెద్దలు టగ్‌ ఆఫ్‌ వార్‌ లాంటి ఆటలాడి తాము మరచిపోతున్న గతానుభూతులను గుర్తుచేసుకున్నారు.

సంతృప్తి

సంతృప్తి


భోజనాలు, ఆటపాటలతో సాగిన కార్యక్రమాన్ని టీపాడ్‌ ఫౌండేషన్‌ కమిటీ చైర్‌ అజయ్‌రెడ్డి, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్‌ ఇంద్రాని పంచెర్పుల, ప్రెసిడెంట్‌ రమణ లష్కర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవి లోకిరెడ్డి, ట్రస్టీలు లింగారెడ్డి అల్వా, రఘువీర్‌ బండారు. మాధవి సుంకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, మంజుల తొడుపునూరి విజయవంతంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వనభోజనాలకు వెళ్లే సంస్కృతి తగ్గిపోయిందని, కానీ ఇక్కడ చాలా గొప్పగా ఏర్పాటు చేశారని నిర్వాహకులను ప్రశంసించారు. పిల్లల కోసం తల్లిదండ్రులు అమెరికా వచ్చారంటే నాలుగు గోడలకే పరిమితమవ్వాల్సి ఉంటుందనే అపవాదును చెరిపివేశారని, ఇక్కడ ఇంతమందితో కలిసి వనభోజనాలకు హాజరవ్వడం తృప్తినిచ్చిందని అభినందనలు తెలిపారు.

 శ్రీనివాస కల్యాణం

శ్రీనివాస కల్యాణం


డాలస్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నామని టీపాడ్‌ నిర్వాహకులు ప్రకటించారు. అలెన్‌లోని అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో , డాలస్‌ హిందూ కమ్యూనిటీ సహకారంతో జూన్‌ 25న స్వామి వారికి, అమ్మవార్లకు వైభవంగా వివాహ మహోత్సవం ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కార్యక్రమం దగ్గరుండి జరిపిస్తారని, హాజరైన వారందరికీ తిరుమల వెంకన్న ప్రసాదంతోపాటు వస్త్రాన్ని అందజేస్తారు.

English summary
get together conducted dallas telugu people. some people does dance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X