‘జై ఆంధ్రా’..: ఆటా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కవిత(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికాలో ఉంటున్న తెలుగు వారి సామాజిక బాధ్య‌త స్పూర్తిదాయ‌క‌మ‌ని నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ అన్నారు. అమెరికాలోని చికాగోలో జ‌రుగుతున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాల‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఆటా మ‌హిళా విభాగం ప్ర‌తినిధులు బ‌తుక‌మ్మ‌లు, బోనాల‌తో ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని కవిత అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి, ఎంపీలు జితేంద‌ర్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, నిజామాబాద్ అర్భ‌న్‌, రూర‌ల్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు పాల్గొన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఈ సంద‌ర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆటా ఉత్స‌వ క‌మిటీ ఆహ్వానం మేర‌కు రెండు రాష్ట్రాల నుంచి హాజ‌రైన సినీ, రాజ‌కీయ ఇత‌ర ప్ర‌ముఖుల‌కు స్వాగతం పలుకుతూ, విద్యావేత్త‌లు, వ్యాపార వేత్త‌లను అభినందించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

క‌మ్యూనికేష‌న్ రంగంలో సాంకేతిక ప‌రిజ్ఞానం అంతగా అభివృద్ధి చెంద‌ని రోజుల్లో 30ఏళ్ల కింద‌ట ఇండియా నుంచి అమెరికాకు రావాల‌నా, ఉద్యోగాల కోసం ఇక్క‌డికి వ‌చ్చే వారికి ఏద‌న్నా క‌మ్యూనికేట్ చేయాల‌న్నా చాలా ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడా ప‌రిస్థితి లేదన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఆటా, తానా.. తెలుగు వారి కోసం రెండు సంఘాలుగా ఏర్ప‌డి.. సామాజిక, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాయని అన్నారు. మ‌న‌మంతా ఒక్క‌టేనని చాటిచెప్తున్న ఈ రెండు సంస్థల నిర్వాహ‌కుల‌కు ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఒక సంస్థ ప‌నిచేయాలంటే సోష‌ల్ క‌మిట్‌మెంట్ చాలా ముఖ్య‌మ‌ని అన్నారు. ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌ నుంచి వచ్చి.. అమెరిక‌న్ క‌ల్చ‌ర్‌లో పెరుగుతున్న పిల్ల‌ల‌కు మ‌న నేటివిటీ గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జెప్పాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

అమెరికాలో పుట్టిన పిల్ల‌లతో పాటు ఇండియాలో పుట్టి,, ఇక్క‌డ పెరుగుతున్న పిల్ల‌ల‌కు తెలుగు నేటివిటీ మ‌ర్చిపోకుండా ఉండ‌టం చాలా ఆనందించ‌ద‌గిన విష‌య‌మ‌న్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

తెలుగు సినిమాలు అమెరిక‌లోని పిల్ల‌లకుతెలుగు భాష‌ను గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జేస్తున్నాయ‌ని, తెలుగు నేటివిటీని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తున్నాయ‌న్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఆటా, తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ క‌లిసి ప‌నిచేయాల‌ని కవిత కోరారు. జై తెలంగాణ, జై ఆంధ్రా అంటూ కవిత తన ప్రసంగాన్ని ముగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha participated in ATA Silver Jubilee celebrations.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి