హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారై భర్త నుండి కాపాడాలని టెక్కీ ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sirisha
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తమామలు తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శిరిషా అనే యువతి ఎన్నారై భర్త పైన మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. శిరీషకు హైదరాబాదుకు చెందిన ఉదయ్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే.

పెళ్లైన ఏడాది తర్వాత శిరీషాకి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. ప్రేమ వివాహం కారణంగా కట్నం రాలేదని, ఆ కట్నం మొత్తాన్ని పుట్టింటి నుండి తీసుకు రావాలని అత్త, మామ, మరిది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పురిటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను భర్త తిరిగి తీసుకుపోలేదు.

ప్రస్తుతం ఉదయ్, శిరీషల కూతురుకు మూడు సంవత్సరాలు. ఆమె భర్త విడాకుల కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతూ శిరీషా గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు.. తనకు తన భర్త, అత్తమామల నుండి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.

తన భర్త మరొక మహిళతో కలిసి ఉంటున్నాడని, వారికి వివాహమైనట్టు తెలుస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శిరీష్ ఫిర్యాదును స్పీకరించిన హెచ్చార్సీ ఈ వ్యవహారంపై దర్యాఫ్తు జరిపి నవంబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది.

English summary
Sirisha, who hails from Hyderabad was complained to HRC against NRI husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X