వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల శ్రమ నుంచే తెలంగాణ సాహిత్యం: అరవిందాలు పుస్తకావిష్కరణలో డా. తిరునగరి

దేవినేని అరవిందరాయుడు రచించిన 'అరవిందాలు' ఏకవాక్య ముక్తక కవితా సంపుటి పుస్తకాన్నిగురువారం ఆవిష్కరించారు.

|
Google Oneindia TeluguNews

మోత్కూరు: తెలంగాణ ప్రజల శ్రమ జీవితం నుంచి సాహిత్యం పుట్టిందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తిరునగరి అన్నారు. మోత్కూరు ప్రజాభారతి సాహితి, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేవినేని అరవిందరాయుడు రచించిన 'అరవిందాలు' ఏకవాక్య ముక్తక కవితా సంపుటి పుస్తకాన్నిగురువారం ఆవిష్కరించారు.

అనంతరం సభనుద్ధేశించి మాట్లాడుతూ.. పూర్వకాలం నుంచి తెలంగాణ సాహిత్యానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రజల భాష, యాసను ఆంధ్రా పాలకులు ఎగతాలి చేసి పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాహిత్యానికి ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు.

అభినయ శ్రీనివాస్ 'పాట'

అభినయ శ్రీనివాస్ 'పాట'

మోత్కూర్ వాసి, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ... మోత్కూర్ ప్రాంతం సాహిత్యానికి, కళలకు నిలయమై అలరారుతుందని, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నారని పేర్కొన్నారు. మోత్కూర్ గురించి శ్రీనివాస్ రాసిన 'అభినయానికి ఊపిరులూదిన మోతుకూరు నేల, కళ కళలాడిన సంబురాలు ఉప్పొంగిన వేళ' పాటను పాడి వినిపించారు.

 రచయిత మాట

రచయిత మాట

రచయిత దేవినేని అరవిందరాయుడు మాట్లాడుతూ... 'గత రెండు సంవత్సరాలుగా ఏకవాక్య ముక్తక కవితలను రాస్తూ వస్తున్నాను.. వాటన్నింటిని పుస్తకరూపంలోకి తీసుకురావడానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అని చెప్పారు. పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయం అందించిన చింతల సత్యనారాయణరెడ్డికి అరవిందాలు పుస్తకం అంకితం ఇచ్చారు.

 ఎస్.ఎన్.చారి అధ్యక్షతన

ఎస్.ఎన్.చారి అధ్యక్షతన

ప్రముఖ చిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు మరియు ఉత్తమ గ్రామీణ విలేకరి అవార్డు గ్రహీత ఎస్.ఎన్. చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశలో యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొరెడ్డి రంగయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కల్వల ప్రకాశ్ రాయుడు పాల్గొన్నారు.

 పాల్గొన్నవారు:

పాల్గొన్నవారు:

వికీపీడియా వరల్డ్ రికార్డు విజేత ప్రణయ్‌రాజ్ వంగరి, అభినయ కళాసమితి అధ్యక్షుడు గుంటి దేవా, తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్యక్షుడు కోమటి మత్స్యగిరి, అనంతుడు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోత్కూరు శ్రీనివాస్, ప్రజాభారతి అధ్యక్ష కార్యదర్శి డి. అరవిందరాయుడు, టి. మనోహరాచారి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

English summary
Devineni Aravinda Rayudu's 'ARAVINDALU' book will be released on October 17th, 2017 in Mothkur, Yadadri district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X