• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చలాన్ని ఎందుకు చదవాలి

By Staff
|

ప్రపంచంలోని ఏ రచయితనైనా అతను జన్మించిన వందేళ్ల తరువాత కూడా ఎందుకు చదువుతాం? అతను ఎంత పాతవాడైనా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తాడు కనక. అతను చెప్పిన నిజాలను ఇప్పటికీ ఆచరించడానికి మనం ధైర్యం చెయ్యలేం కనక. ఎంతో ఆధునికులం అనుకునే మనం ఎంత సనాతనులమో అతని పుస్తకాలు చెప్తాయి కనక. ఇలాంటి కారణాలు చాలా వున్నాయి, మనం ఈనాటికీ చలం పుస్తకాలు చదవడానికీ, మరో వందేళ్ల వరకూ చదువుతూ వుండడానికి.

జీతానికీ, సాహిత్యానికీ మధ్య సరిహద్దును చెరిపేసిన మహానుభావుడు చలం. అతని సాహిత్యం, జీతం రెండూ మరెవరితోనూ పోల్చలేనంత లక్షణమైన. సాహిత్య లక్షణపరంగా చూస్తే చలం రచనలు 'చలం సు్మతాల'నే చెప్పాలి. ఆధునిక యుగంలో శ్వనాథ వల్ల ప్రభు సు్మతాలు, గోపీచంద్‌ వల్ల ుత్ర సు్మతాలూ, బుచ్చిబాబు వల్ల కాంతా సు్మతాలూ తెలుగు పాఠకుడికి అలవాటైనాయి. చలం రచనలు ఈ మూడు కోవలకీ చెందవు. అ కేవలం 'చలం సు్మతాలు'. అతను శాసించడు, బుద్ధి చెప్పడు, బుజ్జగించడు. ఉన్నది ఉన్నట్లు, కుండ బద్దలు కొట్టినట్లు, కచ్చితంగా, నిర్ద్వంద్వంగా, బేషజాలకు, మొహమాటాలకు తావు లేకుండా చెప్తాడు.

చలం ఎవరి కోసం రాశాడో గుర్తిస్తే, అతన్ని ఇంకా ఎందుకు చదవాలో, అసలు చదవాలో, అవసరం లేదో అర్థం చేసుకోవచ్చు. చలం స్త్రీల కోసం, స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ క్షేమం కోసం రాశాడనడంలో ఎవరికీ అభిప్రాయభేదం లేదు. చలం రాసిన రోజుల్లో స్త్రీలు తమ గురించి ఆలోచించుకునే వారు కారు. తమకు స్వేచ్ఛ కావాలని అనుకునేవారు కారు. తాము నికృష్టంగా బతుకుతున్నామని భాంచేవారు కారు. ఒక వేళ భాంచినా, అది చాలా సహజమైన షయంగా తీసుకునే వారు. దానికి తోడు కర్మ సిద్ధాంతం వుండనే వుంది. తాము బాగుపడాలనీ, పడవచ్చుననీ స్త్రీలు ఎరుగని రోజుల్లో చలం కలం చేత బట్టాడు. స్త్రీకి తనకొకక అస్తిత్వం వుంటుందని కూడా తోచని ఆ రోజుల్లో చలం వంటి పురోగాు, ధైర్యశాలి దార్శనికుడు అవసరమయ్యాడు. ఈనాటి స్త్రీలలో చాలా మందికి తమ నిజస్థితి తెలుసు. వారి ఆలోచన పదునెక్కింది. అవకాశాలు రెట్టింపయ్యాయి. సైద్ధాంతికంగానైనా, ప్రభుత్వ శాసనాల్లోనైనా, పురుషులతో 'సమానత్వం' లభించింది. తమకు కావలిసినది చెప్పగల ధైర్యం వచ్చింది. తమకు కూడా ఏదో కావాలన్న తపన హెచ్చింది.

మరి ఇప్పుడెందుకు, ఏ ప్రయోజనం ఆశించి చలాన్ని చదవాలి? ఇప్పుడు శతజయంతులూ, సదస్సులూ జరుపుకుంటున్నది చలానికి ఉడుతా భక్తిగానా? ఆయన రచనలకు 'ఆంటిక్‌ వాల్యూ' వుందనా? మన శ్లేషణా సామర్థ్యాన్ని ప్రదర్శించుకోడానికేనా? చలం భక్తులు ఇంకా బతికే వున్నారని ప్రపంచానికి గుర్తు చేయడానికేనా?

ఇవేd కాక, చలం ఈనాటికీ ఒక 'సామాజిక అవసరం' కనకనా? ఏ సమాజమూ తనకు అవసరం లేని, ఏదో రూపంలో తనను ప్రభాతం చేయలేని రచయితను ఎక్కువ కాలం గుర్తుంచుకోదు. సమాజంతో పని లేక, కేవలం సాహిత్య లువలే ఉన్న రచనలను 'క్లాసిక్స్‌' బిరుదిచ్చి, గౌరంచి, అటకెక్కిస్తామేమో గానీ, వాటిని సొంతం చేసుకోం. చలం సాహిత్య రచనలేd 'క్లాసిక్స్‌' కావు. చలమే క్లాసిక్‌. అతని రచనలన్నీ అతని వ్యక్తిత్వానికి పూరకాలే గానీ అతని నుంచి డిపోయి కేవలం సాహిత్య గ్రంథాలుగా నిలిచే రచనలేd చలం చేయలేదు.

చలం ఈనాటి సమాజానికి కూడా ఎందుకు అవసరమో ఆలోచించాలి. అప్పటికీ, ఇప్పటికీ స్త్రీల బాహ్య జీతంలో కొన్ని మంచి మార్పులు వచ్చిన మాట నిజమే. స్త్రీలకు ద్య, ఉద్యోగం, ప్రేమ వాహం, తంతు పుర్వివాహం, డాకులు- ఇవన్నీ సాధారణమై పోతున్న రోజులి. కాని ఇవన్నీ పైపైన కనిపించే నష్టపరిహారాలే. మౌలికంగా స్త్రీ పట్ల సామాజిక దృక్పథం, పురుషుడి దృష్టి అంతగా మారలేదు. ఉదాహరణకు, ఇప్పటికీ, 'శీలం' అంటే లైంగికపరమైన శీలమే, (పరిపూర్ణ వ్యక్తిత్వం కాదు). ఆ 'శీలం' ఒక్క స్త్రీకే ఉంటుంది. కనక ఆమె మాత్రమే 'శీలం' కోల్పోతుంది. తద్వారా పతనమవుతుంది. తనకు లేని దాన్ని ఎవడూ కోల్పోలేడు కనక, పురుషుడికి 'శీలం' పోయే బాధ లేదు. అందుకని అతనెప్పుడూ పత్రుడే. చలం పత్రతకి ఇచ్చిన వరణ వేరు. ''నిర్మలత్వమంటే యెటువంటిదో, దాన్ని కాపాడుకోవడమెట్లానో స్త్రీ తనకు తానే నిర్ణయించుకోవాలి. అటువంటి సర్వోన్నతమైన తన పత్రతని, మృదు మధురమైన తన శరీరాన్ని, యోగ్యతని, గూఢత్వాన్ని, అర్హుడు కాని భర్తకైనా సరే ఇవ్వని ధైర్యాన్నీ, అభిమానాన్నీ అభ్యసించడం స్త్రీ ధి'' (స్త్రీ. పే. 38) ఈనాడు దేశాలేలుతున్న స్త్రీలు కూడా చేయలేకపోతున్న పని ఇది. ''స్త్రీకి అందరి యెడలా తాను జరుపుకోవలసిన ధులు ఉన్నాయి. తన యెడల తాను జరుపుకోవలసిన ధులు మాత్రం లేవు'' అన్న చలం మాటలు మరో వందేళ్ల వరకూ మన దేశంలో సగం పైగా స్త్రీ జనాభాకు వర్తిస్తూనే వుంటాయి. తన శరీరాన్ని, తన మనసునీ పట్టించుకోవడం స్త్రీ నేర్చుకోనంత కాలం చలం అవసరం వుంటూనే వుంటుంది.

ఆనాటికీ, ఈనాటికీ మారినట్టుగానే కనిపిస్తూ ఏ మాత్రం మారని వ్యవస్థ వాహం. ఐదు రోజుల పెళ్లిళ్లు పోయి ఒక్క గంట పెళ్లిళ్లు, రిజిస్టర్‌ పెళ్లిళ్లు, స్టేజి పెళ్లిళ్లు వచ్చి వుండొచ్చు. వజ్రాల కమ్మల లాంఛనాలు పోయి ఫ్రిజ్‌లూ, టీdలూ, స్కూటర్ల లాంఛనాలు వచ్చి వుండొచ్చు. రూపాల్లో, పద్ధతుల్లో మాత్రమే తేడా. వ్యవస్థలో జీర్ణమైపోయిన ద్వంద్వ ప్రమాణాలూ, హిపోక్రసీలు యధాతదంగా ఉన్నాయి. చలం అన్నట్టు '' మతమూ, మూర్ఖమూ, నీతి, అనుమానమూ, నిర్భంధమూ, dటివల్ల ఏర్పడ్డది- ఈ వాహబంధం'' (స్త్రీ- పేజీ 92). వాహబంధం శాశ్వతం కావటానికి అవసరమైన మూడు ముళ్లు, సప్తపది, పసుపు కుంకుమలు, మల్లెపూలు, తెల్లచీరా కావు- ప్రేమ, శ్వాసం, నిజాయితీ, లోకజ్ఞానము, సత్యం అని ఏనాడో చెప్పాడు చలం. ఈనాటికీ మన పుస్తకాలలో, సినిమాలలో '' నేను ప్రేుంచే నా భర్తను నాకు దూరం చేయకు'' అని లన్‌ని ప్రాధేయపడే నాయిక కనిపించదు. '' నా పసుపు కుంకుమలు తుడిచేయవద్దు'' '' నామాంగళ్యాన్ని కాపాడు'' అనే ''ప్రతివ్రత'' తప్ప. భర్త పోయాక కూడా కుంకుమ పెట్టుకోనిచ్చి, మాంగల్యం ఉంచుకోనిచ్చేటట్టయితే, వాడు వున్నా, పోయినా వాళ్లకు ఒకటేనేమోనన్న అనుమానం వస్తుంది, ఈ అభివ్యక్తి చూస్తుంటే. పసుపు కుంకుమలు, మాంగల్యం అన్న సాంస్కృతిక చిహ్నాలు మాత్రమేననీ, అ సూచించే వ్యక్తి అటౌరవానికి పాత్రుడా, కాడా అన్న వేచన లేనపుడు వాటిక్కూడా లువ ఉండదనే 'నేటి ద్యాధికురాలైన' స్త్రీ కూడా తెలుసుకోలేనపుడు, చలం అవసరం అపుడే తీరుతుందా?

చలం సమకాలీనులైన భావ కవులంతా తమ ఊహా ప్రేయసులను ఆరాధిస్తే, ఒక్క చలం మాత్రం స్త్రీ లోకాన్నే ఆరాధించాడు, గౌరంచాడు. ఇతర సంస్కర్తల్లా చలం స్త్రీని నెత్తిdుదా పెట్టుకోలేదు. నేల dుదికీ లాగలేదు. చలం స్త్రీ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకున్నాడు.

చలం dుదవున్న ఎన్నో అభియోగాల్లో ఒకటి, అతను స్త్రీ స్వేచ్ఛను లైంగిక స్వేచ్చకు పర్యాయంగా ప్రచారం చేశాడని, ఆరకమైన జీతం గడిపిన అతని స్త్రీ పాత్రలేd సుఖపడలేదు గనుక, అతని సిద్ధాంతం కూడా ఫలమైందనీ. చలం స్త్రీ లైంగిక స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పటానికి కారణం, సమాజంలోని ద్వంద ప్రవృత్తినీ, దుర్నీతిని ఆ సామాజిక నియమాలతోనే తిప్పికొట్టాలన్న ఆకాంక్ష కనిపిస్తుంది. అంతేకానీ, శృంఖలశృంగారం స్త్రీలకు ఆనందాన్ని ఇస్తుందని కాదు. ఒక సమాజం స్త్రీని భోగవస్తువుగా చూస్తున్నప్పుడు, స్త్రీని శీలం పేరిట కట్టడి చేస్తున్నపుడు, స్త్రీలపై లైంగిక అత్యాచారాన్ని చట్టబద్దం చేస్తున్నపుడు, ఆ సామాజిక పరిభాషలోనే సమాధానం చెప్పవలసిన అవసరం చలంకు కనిపించి వుంటుంది. అందుకే, అన్ని స్వేచ్ఛలకంటే ముందు 'లైంగిక స్వేచ్ఛ'నే ఆయన ప్రచారం చేశాడు.

చలం సృష్టించిన స్త్రీలు జీతంలో పరాజయం పొందారన్నది మరో మర్శ. లేచిపోవటం వల్లనో, అక్రమసంబంధాల వల్లనో స్త్రీ అద్భుతమైన జీతాన్ని గడుపుతుందని చలం ఎక్కడా చెప్పలేదు. పతనమౌతుందో, ప్రతిష్ట సంపాదించుకుంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ స్త్రీకి వుండాలన్నదే ఆయన సిద్ధాంతం. స్త్రీని ఆమెకు యిష్టం వచ్చినట్టు బతకనివ్వాలి. ఆమె పతనమైనా తన ఇష్టం కొద్దీ పతనమవ్వాలి. బాగుపడ్డా తన సామర్ధ్యం కొద్దీ బాగుపడాలి. అంతేగాని, సామాజిక కట్టుబాట్లవల్ల 'పత్రంగా' వుండటం నిజమైన పత్రత కాదు. '' వ్యభిచారం చేయటానికి కానీ, మానటానికి గానీ స్వేచ్ఛ వున్నపుడు పతివ్రతో, దుర్మార్గురాలో కావటానికి dలుంది కానీ, అసలు దుర్మార్గం చేయడానికి dలు లేనపుడు పత్రులేుటి?'' అన్న మాటల్లో (స్త్రీ- పేజీ 50) తిరుగులేని తర్కం వుంది.

ఆనాటి సమాజంలో సామాజికంగా గానీ, ఆర్ధికంగా గానీ స్త్రీ ఎలాగో బలహీనురాలే కానుక, పురుషుడికి ఆమె పట్ల చులకన భావం సహజంగానే వుండేది. తను యజమానిననీ, ఆమె బానిస అనీ అతను, ఆమె కూడా నమ్మేవారు. ఈనాడు సామాజికంగా వున్నత హోదాలలో వుంటూ, ఆర్ధికంగా స్తోమత కలిగిన స్త్రీ పురుషుడికి ఒక సవాల్‌ గా మారింది. అతనిలో నూన్యత, అసూయ అనే అవలక్షణాలను ఆమె స్ధితి కలిగిస్తోంది. తరతరాలుగా జీర్ణంచుకుపోయిన చులకలన భావనకు తన నూన్యత, అసూయ, భయం తోడై పురుషుడు ఆమెపై పెత్తనం చెలాయించడానికి కొత్తకొత్త రీతులను అన్వేషిస్తున్నాడు. ఈనాటి స్త్రీ తన స్వేచ్చా సమానత్వాల కోసం పోరాడ్డం మాట అటుంచి తిండికి, బట్టకి,కనీస సౌకర్యాల కోసం కూడా స్వశక్తిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలా ఆధారపడ్డానికి ఆధునిక స్త్రీకి అభ్యంతరమూ లేదు. కానీ స్వశక్తితో జీస్తూనే పురుషుడి అధికారానికి లోబడి వుండాల్సి రావటం ఈనాటి స్త్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. చలం అన్నట్టు ' స్త్రీకి కావల్సింది సంపూర్ణాధికారం'. ఈ అధికారం చేజిక్కించుకోవటం కోసం తిరగబడ్డమే ప్రధానమైన మార్గమన్నాడు చలం.

ఈ' తిరగబడే' శక్తినీ, తిరగబడడానికి కావల్సిన స్ఫూర్తిని ఈ నాటికీ అందిస్తున్నాడు చలం. వ్యక్తిని సమాజం కంటే ఉన్నతుడిగా భాంచే చలం తాత్విక దృక్పధంలో కొన్ని లోపాలుంటే ఉండొచ్చు. కాని మనిషి ఆనందం కోసం అతను పడ్డ ఆరాటం, ఎన్నో ఆటుపోట్లను అద్భుతమైన సెన్సాఫ్‌ హ్యూమర్‌తో అతను తట్టుకున్నవైనం, ఏనాటికైనా స్త్రీలకూ, పురుషులకూ కూడా ఆదర్శప్రాయమైనవే. ' తెల్లారి లేస్తే పిడకలు, మళ్లు, అలుకులు, ఇవన్నీ వొదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం- ఎప్పుడు కలుగుతుంది మానవులకి?' అని 1952లో ప్రశ్నించిన చలం నేటి స్త్రీ పురుషులను చూసి, ఈ అర్ధంలేని హైరానాను, అంతులేని వైషమ్యాలను చూసి మో 'స్త్రీ' రాసుడేవాడేమో! మరో చలం పుట్టే వరకూ ఈ చలాన్ని చదువుతూ, అతని రచనల నుంచి ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త ఆలోచనలను జీతంలో సమన్వయించుకుంటూ ముందుకు సాగాల్సిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more