వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడి రచయిత కొకు

By Staff
|
Google Oneindia TeluguNews

కొకుగా ప్రసిద్ధుడైన కొడవటిగంటి కుటుంబరావు గురించి తెలిసే వుంటుంది. ఆయన నవలలు, కథలు, సాహిత్య వ్యాసాలు, సైన్స్‌ వ్యాసాలు అనేకం రాశారు. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుండాలని చెప్పిన కొడవటిగంటి రచనలన్నీ సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చేవే. ఆయనది వచనంలో అందె వేసిన చేయి. కథ చెప్పడంలో ఏ రకమైన సంక్లిష్టతా వుండదు. వస్తువుపై ఆయనకున్న స్పష్టతే ఆయన శైలిలోనూ వ్యక్తమవుంతుంది. ఆయన రచనలు సమకాలీన సామాజిక, ఆర్థిక పరిణామాలను ప్రతిబింబిస్తాయి. ఆయన వచనానికి ముందే చెప్పినట్లు పాఠకుడిని తన వెంట తీసుకుపోయే లక్షణం వుంది.

ఆయన 'చదువు' నవల సామాజిక చారిత్రక నవల. ప్రధాన పాత్ర అక్షరాలు దిద్దడంతో ప్రారంభమై ఈ నవల ఆ ప్రధాన పాత్ర కుమారుడు అక్షరాలు దిద్దడంతో ముగుస్తుంది. చదువు అంటే కేవలం పుస్తకాల్లో వుండేది కాదు, నిజమైన చదువు అనేది సామాజిక అధ్యయనం అనేది ఆయన ప్రతిభావంతంగా ఈ నవల ద్వారా చెప్పారు. ఏది రాసినా ఆయన చాలా సులభశైలిలో రాశారు. 'ఐశ్వర్యం', 'వారసత్వం', 'ఎండమావులు', 'కొత్త కోడలు', 'కొత్త అల్లుడు', 'తిుంగలం వేట', 'తార', 'బ్రతుకు భయం', 'సరితా దే డైరీ' కొకు రాసిన నవలల్లో కొన్ని. ఆయన అనేక కథలు కూడా రాశాడు. ఆయన ఆంధ్ర ప్రజల మధ్యతరగతి బ్రతుకులకు తన రచనల్లో అద్దం పట్టారు. ఆయన రచనలు మనకు ఆంధ్ర సామాజిక, ఆర్థిక పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.

శైలిలోనూ, భాషలోనూ ఏ రకమైన సంక్లిష్టతా వుండదు. సామాన్య పాఠకులకు అర్థమయ్యే రీతిలో చక్కని శిల్పనైపుణ్యంతో ఆయన రచనలు సాగుతాయి. ఆయన అనేక సాహిత్య వ్యాసాలు రాశారు. తన వ్యాసాల్లో సాహిత్య ప్రయోనం గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. మధ్యతరగతి ప్రజలను కేంద్రీకరించుకుని రాసిన ఆయన రచనలకు ఆయన వచన శైలి సరిగ్గా సరిపోతుంది. ఆయన కథలు రాయడానికి పెద్దగా కష్టపడినట్లు అనిపించదు. ఆయన సామాజిక పరిశీలనా శక్తి ఎంత సునిశితమైందో ఆయన రచనలు మనకు తెలియజేస్తాయి. సినిమా రంగంతోనూ, పత్రికా రంగంతోనూ ఆయనకు దగ్గరి పరిచయం వుంది. సినిమా బ్రతుకులను కూడా మనకు ఆయన రచనల్లో మనకు చూపించారు. కొకు రచనలను మనం తప్పకుండా చదవాలి. ఆయన కథలు, నవలలు సంపుటాలుగా వెలువడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X