• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రష్డీని భరించడం కష్టమే..

By Pratap
|

ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీ పట్ల గతవారం వ్యక్తమైన అసహనం పట్ల చాలా మంది మాట్లాడుతున్నారు. తన సాటానిక్ వర్సెస్‌ను దురదృష్టవశాత్తు నిషేధించడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్టీని 'ద్వేషించడానికి' ఒక్కటి కన్నా ఎక్కువ కారణాలే ఉంటాయని చెప్పాల్సిన అవసరం ఉంది.

రష్దీ రాసే వచనాన్ని భరించడం ఎంత కష్టమనే విషయంపై నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఈ అభిప్రాయాన్ని అంగీకరించరు. కానీ రష్టీ రచనలను చదవడం చాలా శ్రమతో కూడుకున్న పని. రష్దీ మొదటి నవలను చదవడం ప్రారంభిస్తే ముగించడం అంత సులభం కాదు. అంతగా అది మనల్ని లాక్కుపోతుంది.

ఉత్తమ సాహిత్యాభిరుచి, రష్టీ వంటి రచయిత ప్రదర్శించిన లోతను, అంతర్దృష్టిని అర్థం చేసుకునే స్థాయి వారికి లేదని చెప్పేస్తే సరిపోతుందా? బహుశా. కానీ రష్ధీని అంగీకరించని నేను అటువంటి పాఠకుల మధ్య ఉన్నానని అనుకుంటే, నేను ప్రత్యామ్నాయం చూపిస్తాను.

Mr Rushdie

బహుశా ఎందుకంటే, భారత పాఠకులు పఠనయోగ్యం కాని సంక్లిష్టమైన వచనం రాసే రచయితలను పైమెట్టు మీద నిలబెడతాం. పఠన ప్రియులు నిర్వచం ద్వారా ఉత్తమ రచన గురించి ఆలోచించినప్పుడు సంక్లిష్టంగా, అవగాహన దుర్లభంగా ఉండాలని అనుకుంటారు. అలా ఆలోచిస్తున్న తరుణంలో మరో కోణం నుంచి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. మనం, భారతదేశం గురించి పాశ్చాత్య పాఠకుల కోసం చేసిన రచనలను సాహిత్య ప్రతిభగా గుర్తించడానికి అలవాటు పడలేదా, రోజావారీ జీవితంలోని పాత కథలనుంచి, సామాన్య మధ్యతరగతి సమస్యల నుంచి చూడడం ప్రారంభించలేదా అని ఆలోచించాల్సి ఉంటుంది.

అటువంటి రచనలకు అవార్డుల ద్వారా, జైపూర్ సాహిత్య ఉత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రచారం కల్పించడం వల్ల ప్రయోజనం శూన్యమే. తమ పట్ల ఇస్లామిస్టుల వంటి వారి ఆగ్రహానికి గురైతే, తమ రచనలు చాలా గొప్పవని చెప్పుకోవడానికి తగిన అదృష్టం కూడా వారిని వరిస్తోంది.

భారత ఆంగ్ల రచయితల విషయానికి వస్తే, నెత్తికి ఎత్తుకోవడానికి చాలా మందే ఉన్నారు, కానీ ఎవరూ చదవరు. చేతన్ భగత్ వంటి రచయితలను దిగ్భాంతికరమైన ప్రశంసతో ఎవరూ చూడరు. ఎందుకంటే, బ్రెయిన్ వాష్ అయిన బానిసగా ఉండడానికి ఉవ్విళ్లూరే రచయిత మాదిరిగా ఆయన మరణం, వ్యాధి, పేదరికం, బ్రిటిష్ పాలన గురించి రాయడు. అటువంటి గ్రంథాలకు పాశ్యాత్య సమాజం అత్యుత్తమ సాహిత్య విలువలను ఆపాదించాల్సి ఉంటుంది.

భారత కథలను సాధారణమైన భారత పాఠకుడికి అందించడమే భగత్ సాధించిన విజయం. భారతీయులున చదవడానికి ఇష్టం లేకపోవడం వల్ల వాటికి మార్కెట్ ఉండడం లేదనేది నిజం కాదు. భారతీయుల కోసం రాయనివాటి గురించి రాయడం వల్లనే.

ఓ చైనీస్ బ్లాగర్ ఇలా అన్నాడు -

"భగత్ గురించి ప్రజలు నిటారుగా చూడాల్సి ఉంటుంది. భగత్ ఎక్కువగా దేశీయ భాషలో హృదయానికి హత్తుకునే వచనంలో రాస్తున్నాడు. తద్వారా భారత యువత గురించి కచ్చితమైన చిత్రాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ఇక్కడ పూరకాలను ప్రయోగించదలుచుకోలేదు, కానీ చేతన్ భగత్ రాయలేడని లేదా తేలికపాటి కథలు రాస్తాడని చెప్పే తప్పుడు మేధావులను వ్యతిరేకించదలుకున్నా. జీవితంలోని అత్యంత శాశ్వతమైన, సుందరమైన, విశ్వజనీనమైన వాస్తవాలు అతి సాధారణంగా ఉంటాయని మనకు తెలియదా? అవి జీవితం మాదిరిగా ఉన్నాయనే విషయాన్ని చాలా కాలంగా విమర్శనా రంగంలో ఉన్నవారు మరిచిపోయారు".

కామన్ సెన్స్ అనే అద్దంలో మొత్తం గందరగోళాన్ని చూడడం ప్రారంభిస్తే, గ్రహించిన విలువల మీద, తయారైన సందర్భోచితాల మీద సాహిత్య ప్రతిభ నిచ్చెనమెట్ల పరిస్థితి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. పుస్తకాలపై మనం చాలా కాలంగా - పవిత్రం, లౌకికం, మరోటి - గురించి చేస్తున్నాం. పుస్తకాల గురించి యుద్ధం చేయడం ఆపేశాం. రష్దీ రచనల పట్ల విజయ్ మొహింతి అభిప్రాయాన్ని ఆంగ్లంలో http://www.niticentral.com/2013/02/the-barely-tolerable-mr-rushdie.html చదవుకోవచ్చు.

- విజయేంద్ర మొహంతీ

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In light of all that has been said this past week about the intolerance on display against acclaimed author Salman Rushdie and the opinions he has expressed in his unfortunately banned book Satanic Verses, it is perhaps worth mentioning that there can be more than one reason to ‘hate’ Rushdie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more