సీఎస్కే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ధోనీకి ఏమైంది? (వీడియో)
ఐపీఎల్ 19 సీజన్ మార్చి 28న ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలు కాగా.. సీఎస్కే క్యాంపులో ఆందోళన నెలకొంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో ఎంఎస్ ధోనీ కుంటుతూ నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 44 ఏళ్ల వయస్సులోనూ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్న ఎంఎస్ ధోనీ గాయం సీఎస్కే వ్యూహాలను దెబ్బతీసేలా ఉంది.
వైరల్ వీడియోలో ఏం ఉందంటే?
ట్రైనింగ్ సెషన్ ముగించుకుని తన కిట్ బ్యాగ్ పట్టుకుని ఎంఎస్ ధోనీ స్టేడియం బయటకు వస్తున్న సమయంలో ఆయన నడకలో కొంచెం తేడా కనిపించింది. అడుగులు వేయడానికి ఎంఎస్ ధోనీ ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా చురుగ్గా ఉండే ఎంఎస్ ధోనీ ఇలా కుంటుతూ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని సీజన్ల నుంచి ఎంఎస్ ధోనీ తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చివర్లో ఫినిషర్‌గా వస్తున్నాడు.

సీఎస్కేకు పెరుగుతున్న గాయాల బెడద
కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే కాదు.. సీఎస్కే జట్టులో గాయపడిన ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది. నాథన్ ఎల్లిస్ తొడ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరుమయ్యాడు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ లేకపోవడం జట్టు బౌలింగ్‌పై ప్రభావం చూపనుంది. మాథ్యూ షార్ట్ బొటనవేలు ఫ్రాక్చర్ కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
MS Dhoni struggling while walking after a practice session.
— Sonu (@Cricket_live247) March 20, 2026
I think this is his last season, as age seems to be catching up with him. pic.twitter.com/ZaR17O7O32
ధోనీకి ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్!
ధోనీకి గాయమైనా.. ఈ సారి సీఎస్కే యాజమాన్యం దగ్గర ఓ బలమైన ప్రత్యామ్నాయం ఉంది. అతడే సంజూ శాంసన్. ఈ సీజన్లో సంజూ శాంసన్ జట్టులోకి రావడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకోవడానికి వీలవుతుంది. ఎంఎస్ ధోనీ ఫిట్నెస్ను బట్టి కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోవాలా లేదా విశ్రాంతినివ్వాలా అనే విషయంలో జట్టు యాజమాన్యానికి ఇప్పుడు కొంత వెసులుబాటు దొరికింది. జట్టులో మెరుపు దాడి చేసే ఉర్విల్ పటేల్ కూడా అందుబాటులో ఉన్నాడు.
గత సీజన్ లెక్కలు ఇలా..
గత సీజన్లో ఎంఎస్ ధోనీ 14 మ్యాచ్‌ల్లో 196 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సమయంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సారి కూడా ధోనీ ఫిట్‌గా ఉంటే ఫినిషర్‌గా మెరుపులు మెరిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ధోనీ గాయం గురించి అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
-
మనోడు మళ్లీ మొదటికొచ్చాడు భయ్యా- ట్రీట్మెంట్ ఇస్తే గానీ -
అభిషేక్ శర్మకు IPLయాజమాన్యం భారీ షాక్- అదే వద్దు, తగ్గించుకోకుంటే..ఇక..!! -
ఎన్నికల ప్రచారంలో సంజూ శాంసన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!! -
IPL 2026 KKR vs SRH: తొలి గెలుపు కోసం ఇరు జట్లు ఆరాటం..విజయావకాశాలు వారికే..? -
'ధురందర్’ స్టెప్పుతో సూర్యకుమార్ యాదవ్ రచ్చ! వీడియో -
IPL 2026: శ్రీలంక బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ ప్లేయర్ -షాకింగ్ రీజన్..! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications