Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు: ఏమిరా బాలరాజు?

గౌహతిలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 489 పరుగులు చేయగా.. దానికి సమాధానంగా బరిలోకి దిగిన టీమిండియా ఒక రోజు కూడా పూర్తిగా ఆడకుండానే 201 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు టీమిండియా బౌలర్లు టెంబా బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టును ఆలౌట్ చేయడానికి ఏకంగా 151 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది.

స్వదేశంలోనూ నిరాశే.. టీమిండియాకు ఏమైంది?
గౌహతి టెస్టులోనే కాదు.. గత కొంతకాలంగా భారత్ స్వదేశంలోనే వరుసగా ఓటములను చవిచూస్తోంది. బ్యాటర్లలో అనుభవం, నిలకడ కనిపించడం లేదు. అలాగే బౌలింగ్‌లో కూడా పదును లోపించింది. అయినా సరే టీమ్ మేనేజ్‌మెంట్ మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి అనుభవజ్ఞులను దేశవాళీ దిగ్గజాలను పక్కన పెడుతూనే ఉంది.

No Bowling No Batting What Wrong With Team India in the Guwahati Test

150 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా
గౌహతిలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 151 ఓవర్లలో అంటే 906 బంతులను ఎదుర్కొన్నారు. ఇది మూడు వన్డే ఇన్నింగ్స్‌లకు సమానం. దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా భారత బౌలర్లకు అడ్డుకట్ట వేసి సులభంగా వికెట్ ఇవ్వకుండా నిలబడ్డారు.

ఎక్కడ షమీ? ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు?
మహ్మద్ షమీ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. షమీ ఎంపికపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. దేశవాళీ క్రికెట్‌లో షమీ వరుసగా వికెట్లు తీస్తున్నప్పటికీ, అతన్ని జట్టులోకి తీసుకోవడం లేదు. సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు కూడా షమీని జట్టులో చేర్చాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అయినా మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు.

కరుణ్ నాయర్, సర్ఫరాజ్‌లకు ఎదురుచూపులు
కరుణ్ నాయర్ దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ ఆ సిరీస్ తర్వాత అతన్ని మళ్లీ తప్పించారు. దేశవాళీ క్రికెట్‌లో అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కూడా సుదీర్ఘకాలంగా తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ ప్రదర్శన కంటే ఐపీఎల్ ఆధారంగా జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లపై మేనేజ్‌మెంట్ నిరంతరం నమ్మకం చూపుతోంది.

అనుభవం, నిలకడ కొరత
ప్రస్తుతం భారత టెస్టు జట్టులో అనుభవం, నిలకడ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఏ బ్యాటర్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండి, వికెట్ కాపాడుకుంటూ డిఫెన్స్ చేసి ఆడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఐపీఎల్ శైలిలో బ్యాటింగ్ చేస్తూ త్వరగా ఔట్ అవుతున్నారు. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెడుతూ, టెస్టు క్రికెట్‌కు అవసరమైన నిలకడ లేని ఆటగాళ్లతో టీమ్ మేనేజ్‌మెంట్ ముందుకు వెళ్లడంపైనే ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+