Ind-SA ODI: రాంచీలో రోహిత్-కొహ్లీ మెరుపులు- సౌతాఫ్రికా బెంబేలు..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేలో సిరీస్ లో భాగంగా ఇవాళ రాంచీలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో భారత్ దూకుడుగా ఆడుతోంది. ఈ డేనైట్ వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. తొలుత తడబడినట్లు కనిపించింది. అయితే దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ను పేసర్ నాండ్రే బర్గర్ వికెట్ కీపర్ క్యాచ్ తో ఔట్ చేశాడు. అనంతరం రోహిత్ శర్మకు వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కొహ్లీ జతకలిశారు.
రోహిత్-కొహ్లీ జోడీ సౌతాఫ్రికా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలోనే రోహిత్, కొహ్లీ ఇద్దరూ అర్ధసెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరి దూకుడు కొనసాగుతోంది. కొహ్లీ మూడు సికర్లు, నాలుగు ఫోర్లతో అర్ద సెంచరీ చేశాడు. రోహిత్ రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది 351 సికర్ల రికార్డును రోహిత్ సమం చేశాడు.

అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రోహిత్-కొహ్లీ దూకుడు కొనసాగుతోంది. దీంతో భారత్ 19 ఓవర్లలోనే 140 పరుగుల స్కోరు దాటింది. అనంతరం రోహిత్ శర్మ మరో సిక్స్ కొట్టి వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. మరో ఎండ్ లో విరాట్ కొహ్లీ కూడా వరుస సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో టీమ్ స్కోరు 20 ఓవర్లలో 150 పరుగులు కూడా దాటిపోయింది. ఈ తరుణంలో 51 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మను మార్కో యాన్సన్ ఎల్బీగా వెనక్కి పంపాడు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications