కేసీఆర్ ఎంఏ చదువుతున్న రోజుల్లో: ఆ ముగ్గురు మాట్లాడుతుంటే.. అలా వింటుండేవాడు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన వాగ్దాటితో మంత్రముగ్దుల్ని చేసే ఆయన.. విద్యార్థిగా ఉన్నప్పుడు ముగ్గురి ప్రసంగాలను బాగా ఇష్టపడేవాడినని చెప్పుకొచ్చారు.

  Renuka Chowdhury arrest @ Telangana Assembly : Chalo Assembly Protest | Oneindia Telugu

  తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో.. గురువారం నిర్వహించిన బీఏసీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి బీఏసీతో సమావేశమైన ఆయన అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

   ఎవరా ముగ్గురు?:

  ఎవరా ముగ్గురు?:

  1970లో కేసీఆర్ ఎంఏ స్టూడెంట్‌గా ఉన్న రోజులవి. అప్పట్లో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు ఆయన వెళ్తుండేవారు. గ్యాలరీలో కూర్చొని సభ జరుగుతున్న తీరును పరిశీలించేవారు. ఆ సమయంలో ముగ్గురు నేతలు ఆయన్ను బాగా ప్రభావితం చేశారు.

  ఆ ముగ్గురు అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత రాజ్యసభ టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు యజ్ఞ నారాయణ, మాణిక్ రావు. ఈ ముగ్గురు శాసనమండలిలో మాట్లాడుతుంటే తాను నిశితంగా గమనించేవాడినని, వారి వాగ్దాటి ఆకట్టుకునేదని కేసీఆర్ స్వయంగా తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

   వాళ్లకు మంత్రులు కూడా భయపడేవాళ్లు:

  వాళ్లకు మంత్రులు కూడా భయపడేవాళ్లు:

  శాసనమండలిలో కేశవరావు, యజ్ఞ నారాయణ, మాణిక్ రావు వంటి నేతలు మాట్లాడుతుంటే.. వారికి సమాధానం చెప్పడానికి మంత్రులు కూడా భయపడేవాళ్లని అప్పటి విషయాలను కేసీఆర్ ఇప్పటి శాసనమండలి బీఏసీ సభ్యులతో పంచుకున్నారు. ఒక్కోసారి ఏకధాటిగా మూడు గంటల పాటు వాళ్లు మాట్లాడేవారని, గ్యాలరీలో కూర్చొని చర్చను జాగ్రత్తగా గమనించేవాడినని గుర్తుచేసుకున్నారు.

   కేసీఆర్ సూచనలు:

  కేసీఆర్ సూచనలు:

  అప్పట్లో తాను శాసనమండలి వ్యవహారాల్లో యాక్టివ్ గా పాల్గొంటుండేవాడినని, అసెంబ్లీకి మాత్రమే పరిమితం కాలేదని కేసీఆర్ శాసనమండలి బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులతో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సలహాలు సూచనలు కూడా చేశారు. ఒక సబ్జెక్టుపై ఒకే సమయంలో అసెంబ్లీ, శాసనమండలిలో చర్చ జరగవద్దన్నారు. మొదట అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత.. కొద్దిరోజులకు శాసనమండలిలో దానిపై చర్చ జరగాలన్నారు.

  ఇదే తొలిసారి:

  ఇదే తొలిసారి:

  శాసనమండలి చీఫ్ విప్ పాటూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలి బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్ తొలిసారి హాజరయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో కేసీఆర్ పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని మరో అరగంట పాటు పొడగించాలని కేసీఆర్ సూచించినట్టు సుధాకర్ రెడ్డి తెలిపారు. శాసనమండలి సభ్యులు కూడా సమస్యలపై ప్రభుత్వానికి పిటిషన్స్ ఇచ్చే సాంప్రదాయం రావాలని సూచించినట్టు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As a college student who was politically inclined, a young K Chandrasekhar Rao used to frequently visit the assembly to watch the council proceedings from the gallery.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి