AIని మనం అడిగే ప్రశ్న ఖరీదు తెలుసా ? కరెంటు, నీరు ఎంత ఖర్చవుతాయంటే ?
ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటాా సెంటర్లు నిర్వహిస్తున్న గూగుల్, ఓపెన్ ఏఐ వంటి సంస్ధలు యూజర్లు పంపుతున్న ప్రాంప్ట్ లను ప్రాసెస్ చేయడానికి తాము పెడుతున్న ఖర్చు, దీంతో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లపై (AI Data Centres) తీవ్ర చర్చ జరుగుతోంది. మన దేశంలోనూ ఏపీలో గూగుల్ డేటా సెంటర్ (google data centre) రాక తర్వాత దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ డేటా సెంటర్ల నిర్వహణ వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఇప్పటికే చాలా ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గూగుల్ తాజాగా ఏఐపై మనం ఆధారపడటం వల్ల జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని గణాంకాల ద్వారా బయటపెట్టింది. వీటిని గమనిస్తే మనం ఏఐ బానిసత్వం పర్యావరణాన్ని చేస్తున్న నష్టం తెలుస్తుంది.
ఏఐ వ్యవస్థల వెనుక నీరు, కరెంటు (AI)
ప్రస్తుతం ప్రపంచంలో పలు చోట్ల డేటా సెంటర్లు పెట్టేందుకు గూగుల్ తో పాటు ఓపెన్ ఏఐ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ AI వ్యవస్థల వెనుక విద్యుత్, నీరు, కర్బన ఉద్గారాలను విడుదల చేసే భారీ ముప్పు పొంచి ఉంటోంది. ఓపెన్ ఏఐ నివేదిక ప్రకారం, వినియోగదారులు రోజుకు సుమారు 2.5 బిలియన్ ప్రశ్నలను తమ AI వ్యవస్థలకు జనం పంపుతున్నారట. ఇందులో ఒక్కో ప్రశ్న సుమారు 0.34 వాట్-గంటల విద్యుత్‌ను వినియోగిస్తుందని అంచనా. ఇది సాధారణ ఎల్ఐడీ బల్బును 2 నిమిషాలు వెలిగించగల శక్తి.

కరెంటు ఖర్చెంతో తెలుసా ?
వ్యక్తిగత వాడుకను బట్టి, రోజుకు సుమారు 6.8 వాట్-గంటల వినియోగం ఉండవచ్చని అంచనా. దీన్నే లక్షల మందికి వర్తింపచేస్తే.. పది లక్షల వినియోగదారులు రోజుకు 6,800 కిలోవాట్-గంటల విద్యుత్ (అమెరికాలోని 225 ఇళ్లకు సరిపోతుంది) వాడతారు. పది కోట్లకు చేరితే, అది 680,000 కిలోవాట్-గంటలు (22,000 కుటుంబాలకు సమానం). భారతదేశం వంటి దేశాలలో కోట్లాది మంది వినియోగదారుల వాడకం చూస్తే ఈ లెక్కలు నిజంగానే షాక్ కొట్టడం ఖాయం. విద్యుత్ ఒక్కటే కాదు నీటి వినియోగం కూడా ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య.

నీటి ఖర్చెంతో తెలుసా ?
గూగుల్ 2024 పర్యావరణ నివేదిక ప్రకారం, దాని డేటా సెంటర్లు 2023లో 6.1 బిలియన్ గ్యాలన్ల మంచినీటిని వాడాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 17% పెరుగుదల. అధిక పనితీరు గల కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల్ని చల్లబరిచేందుకే ఈ నీటిని వాడారు. భారత్ వంటి దేశాల్లో ఏఐ ఆధారిత పరిశ్రమలే కాదు ఇతర పరిశ్రమలు కూడా భారీగానే నీటిని వినియోగిస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటిని ఏఐ పరిశ్రమలు అధిగమించేలా కనిపిస్తున్నాయి.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications