ఇదెక్కడ మాస్ మామా.. మెగాస్టార్‌కి జోడీగా ఐశ్వర్య రాయ్..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి (జనవరి 12, 2026) 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుండగా.. కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే తన 158వ సినిమాపై ఫోకస్ పెట్టారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మళ్లీ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో కనిపిస్తారనే టాక్ ఉంది. అయితే కథలో మార్పులు చేస్తూ సినిమాను కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారని సమాచారం.

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీని రంగంలోకి దింపేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో చిరుకి జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు వినపడగా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఆమె హీరోయిన్గా నటిస్తారా? లేక అతిథి పాత్రలో కనిపిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
అంతే కాకుండా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇవే డబుల్ బొనాంజా అనుకుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఒకే ఫ్రేమ్ టాప్ స్టార్ హీరోలను చూడటం అభిమానులకు పెద్ద పండుగగా అనిపిస్తుందని అంటున్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

మొత్తానికి ఈ సినిమా అటు మాస్‌తో పాటు ఎమోషనల్ జర్నీ లాగా ఉంటుందని భావిస్తున్నారు. చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త షేడ్‌లో కనిపిస్తారని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయాలన్నీ నిజమైతే చిరంజీవి కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా ఖచ్చితంగా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ బాబీ తెరపై ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications