అప్పుడు గుర్తు లేదా.. అనసూయ, చిన్మయి లపై శేఖర్ భాషా ఫైర్..?
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు శివాజీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. "దండోరా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆ కామెంట్స్ పై సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ రియాక్ట్ అవ్వడం.. మహిళా కమిషన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. విమర్శలు పెరగడంతో శివాజీ క్షమాపణ చెప్పినా కూడా వివాదం మాత్రం సర్దుమనగడం లేదు. ఒక వర్గం శివాజీ వ్యాఖ్యలపై మండిపడుతుంటే.. మరో వర్గం మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ విషయం లోకి బిగ్‌బాస్ ఫేమ్, సినీ నటుడు ఆర్జే శేఖర్ బాషా ఎంటర్ అయ్యారు. గతంలో నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో అతనికి అండగా నిలిచి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి శివాజీకి సపోర్ట్ గా ఉంటూ.. వాటిని కావాలనే వక్రీకరించి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా అనసూయ, చిన్మయిలపై నిప్పులు చెరిగారు. దీంతో ఈ విషయం ఇప్పుడు మరింత బ్లాస్టింగ్ ఇష్యూ లాగా మారింది.

ఏమన్నారంటే..?
చిన్మయి, అనసూయ గతంలో ఇండస్ట్రీలో పెద్దలు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళా హక్కులపై మాట్లాడే నైతిక హక్కు నిజంగా వారిద్దరికీ ఉందా అని నిలదీశారు. వీళ్లు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అంటూ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన లైవ్ చర్చలో వ్యాఖ్యానించారు. అనసూయ 'జబర్దస్త్' షోలో పలుమార్లు ద్వంద్వార్థాలు, బూతు పదాలు ఉపయోగించిందని గుర్తుచేశారు. ఇవి చేసినప్పుడు తప్పు కాదు, ఇప్పుడు మాత్రం నీతులు చెప్పాలా? అంటూ ఘాటు విమర్శలు చేశారు.
బూతు పాట తప్పు కాదా..!
కాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శేఖర్ బాషా, చిన్మయి గతంలో పాడిన పాటల విషయాన్ని కూడా లేవనెత్తారు. ప్రత్యేకంగా 'రోబో' సినిమాలోని 'కిల్లిమంజారో' పాటలోని కొన్ని లైన్లు ఉదాహరణగా చెప్పారు. అప్పుడు అవి అసభ్యంగా అనిపించలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలున్నప్పుడు ఇతరులను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను మంచి ఉద్దేశంతో చెప్పినవిగా అభివర్ణించారు. ఇక ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం జోరుగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!












Click it and Unblock the Notifications