తెలుగు ప్రేక్షకులు ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లి మరీ చూసిన సినిమాలు ఇవే
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నభూతో నభవిష్యతి అన్న రీతిలో ప్రభావాన్ని చూపాయి. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని పాత రోజుల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబాల సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని థియేటర్లకు తరలివచ్చేవారు. టికెట్లు దొరక్కపోతే అక్కడే వంట చేసుకొని తర్వాత షో చూసి ఇంటికెళ్లేవారు. పౌరాణిక, చారిత్రక సినిమాలకు ఆ రోజుల్లో చెప్పలేనంత క్రేజ్ ఉండేది. మన తెలుగులో అలా ఎడ్లబండ్లు కట్టుకొని ప్రజలు థియేటర్లకు తండోపతండాలుగా వెళ్లి చూసిన సినిమాల గురించి తెలుసుకుందాం.
థియేటర్ల బయట ఎడ్లబండ్లు బారులు తీరేవి
1917లో లంకా దహనం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా చూసేందుకు మైళ్లకు మైళ్ల దూరం నుంచి థియేటర్లకు ప్రజలు వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం.. ఈ సినిమా కథ మొత్తం రామాయణ గాథ కావడమే. 1957లో వచ్చిన తెలుగు క్లాసిక్ 'మాయాబజార్' విడుదలైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పండుగ వాతావరణం ఉండేది. ఎస్.వి. రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలను ఒకే తెరపై చూడటానికి పల్లెటూళ్ల నుంచి వందలాది ఎడ్లబండ్లు థియేటర్ల వద్ద బారులు తీరేవి. థియేటర్ల బయట ఎడ్లబండ్ల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాల్సి వచ్చేది.

ట్రాఫిక్ జామ్ అయ్యేది
1963లో వచ్చిన లవకుశ తెలుగు సినీ చరిత్రలోనే ఒక సంచలనం. ఎన్టీఆర్ రాముడిగా నటించిన ఈ సినిమాను చూడటానికి ప్రజలు ఎడ్లబండ్లపై వచ్చి, థియేటర్ల వద్దే వంటావార్పు చేసుకుని సినిమా చూసి వెళ్లేవారు. ఈ సినిమా ప్రదర్శితమైన సెంటర్లలో ఎడ్లబండ్ల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయంటే ఆశ్చర్యమేసేది. అలాగే 1977లో వచ్చిన దాన వీర సూర కర్ణ. నందమూరి తారకరామారావు మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమా చూడటానికి ఆడియన్స్ విపరీతంగా తరలివచ్చారు. ఎన్టీఆర్ పౌరాణిక డైలాగులు వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం ఎడ్లబండ్లు కట్టుకుని రావడం అప్పట్లో ఒక పెద్ద విశేషం.
1977లో వచ్చిన అడవిరాముడు అయితే ఓ సంచలనం అని చెప్పొచ్చు. "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" వంటి పాటలు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కారణంగా పల్లెటూరి జనం ఈ సినిమాను చూడటానికి ఎడ్లబండ్లపై పట్టణాలకు వచ్చేవారు. 1979లో వచ్చిన తెలంగాణ సాయుధ పోరాట కథ మాభూమి సినిమాకు ప్రజలు ఇలాగే వచ్చేవారు. రవాణా సదుపాయాలు సరిగా లేని రోజుల్లో కూడా ప్రజలు తమ అభిమాన హీరో సినిమాను చూడటానికి ఎడ్లబండ్లు కొట్టుకొని మరీ వచ్చేవారంటే వారిపై ఎంత మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు.
-
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications