Layoffs: 3 టాప్ కంపెనీల బ్యాడ్ న్యూస్-ఈ నెలలోనే వందల లేఆఫ్స్..!
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, నానాటికీ తగ్గిపోతున్న లాభాలు టెక్ సంస్థలకు ఊపిరిసలపనివ్వడం లేదు. దీంతో ఓవైపు కృత్రిమ మేథ (AI) వాడకాన్ని పెంచుకుంటూ ఉద్యోగులకు తొలగించే పనిలో పడ్డాయి. గతేడాది మొత్తం కొనసాగిన ఈ ట్రెండ్ కొత్త ఏడాదిలో అయినా మారుతుందని ఆశించిన వారికి నిరాశ తప్పడం లేదు. ఇలా కొత్త ఏడాది మొదలైందో లేదో మూడు టాప్ కంపెనీలు తమ ఉద్యోగుల లేఆఫ్స్ కు సిద్దమైపోయాయి. అయితే ఇవి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లు మాత్రం కాదు.
ఈ నెలలోనే తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన సంస్థల్లో ఫేస్ బుక్ మాతృసంస్ద మెటాకు చెందిన రియాల్టీ ల్యాబ్, సిటీ గ్రూప్, బ్లాక్ రాక్ కంపెనీలు ఉన్నాయి. ఖర్చు తగ్గింపు, కంపెనీల పునర్నిర్మాణం ఈ కార్పొరేట్ దిగ్గజాలకు కీలక ప్రాధాన్యతలుగా మారాయి. ప్రస్తుతం మెటా, సిటీగ్రూప్ మరియు బ్లాక్‌రాక్ వంటి టెక్, ఆర్థిక దిగ్గజాలు వివిధ విభాగాలలో శ్రామిక శక్తి తగ్గింపులను ఖరారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతోంది.

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా తమ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం కోతకు సిద్ధమవుతోంది. కొన్ని వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల పెట్టుబడిని కృత్రిమ మేథ వైపు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్న విస్తృత పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వారం చివర్లో ఈ లేఆఫ్స్ చేయబోతున్నారు. అలాగే ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ ఖర్చులను తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వారం సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనుంది. 2026 చివరి నాటికి 20 వేల లేఆఫ్స్ టార్గెట్ పెట్టుకుంది.

మరోవైపు అసెట్ మేనేజ్ మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ కూడా తాజాగా ఉద్యోగాల కోతను ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 1 శాతం మంది అంటే 250 మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. తమ వనరులు దీర్ఘకాలిక లక్ష్యాలు, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉంచుకునేందుకు నిరంతర సమీక్షలు తప్పవని తేల్చేసింది. అలాగే ప్రత్యామ్నాయ పెట్టుబడులపై తన దృష్టిని పెడుతున్న నేపథ్యంలో ఈ లేఆఫ్స్ తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications