ఇదేం సర్ ప్రైజ్ సార్.. ఫ్లాప్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ !!!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. "అలా వైకుంఠపురం" సినిమాతో టాలీవుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ అందుకొని.. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో #AA22xA6 నటిస్తున్నారు. అయితే అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ ఉంటుందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్లిందని టాక్ వినిపించింది. కానీ మళ్లీ ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికే వచ్చిందని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మరో మూవీని అనౌన్స్ చేశారు బన్నీ. సంక్రాంతి కానుకగా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబో గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు లోకేష్- రజినీ కాంబినేషన్ లో వచ్చిన "కూలీ" తర్వాత LCUలో(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) భాగంగా "ఖైదీ 2" చేస్తారని అందరూ అనుకున్నారు. ఆయన కూడా ఇదే విషయాన్ని పలు వేదికలపై చెప్పారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అల్లు అర్జున్‌తో సినిమాను ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥
— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026
Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficial
STRIVE FOR GREATNESS🔥
▶️ https://t.co/AGCi8q89x2
Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications