నాగబాబు కూడా శివాజీని విమర్శించేవారయ్యారా?
నటుడు నాగబాబుపై సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయిపోతున్న గొడవను కావాలని మరీ కామెంట్స్ చేసి సాగదీశారంటూ ధ్వజమెత్తుతున్నారు. అసలు ఎవరి తరఫున మాట్లాడటానికి నాగబాబు వచ్చారంటూ నెటిజన్లు చర్చ పెట్టారు. ఒకరిని అనేముందు మనమేంటో, మనం వాటిని పాటిస్తున్నామా? లాంటివి చూసుకొని అప్పుడు ఎదుటివారిపై వ్యాఖ్యలు చేయాలి. కానీ నాగబాబు అటువంటివేమీ చేయలేదనంటున్నారు. శివాజీ చెప్పిన మంచిమాటలు అందరూ అనుసరిస్తే మంచిదే అని ప్రజలంతా ఒప్పుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభించింది. ఎంతోమంది మహిళలే అధిక సంఖ్యలో శివాజీకి మద్దతు పలికారు.
ఒకసారి నాగబాబు శివాజీని విమర్శించేముందు తన అన్నయ్య చిరంజీవి సినిమాలోని పాటలను ఒకసారి గుర్తుచేసుకోవాలనుకుంటున్నారు. జై చిరంజీవ సినిమాలో హే జాన, హే హే జాన పాటలో...
పొట్టి బట్టలు కట్టావో
బట్ట బయలే బండారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం
గోదాట్లో కలపకు ఆచారం
చిర్రు చిర్రెతే యవ్వారం
చీకట్లో చేయకు సంచారం
హే జాన
హే హే జానా అందమే ఎంతున్నా
హేయ్ జానా
హే హే జానా దాచుకో కొంతైనా

లిరిక్స్ ను గుర్తుచేసుకోవాలని సూచిస్తున్నారు. పొట్టి బట్టలు కడితే బండారం బట్టబయలవుతుందని ఆ పాటలో చెబుతున్నారు. చీకట్లో చేయొద్దు సంచారం అంటున్నారు. అవన్నీ అద్భుతమైన సంస్కృత పదాలా? అత్యద్భుతమైన రచనా సాహిత్యమా? వాటిల్లో డబుల్ మీనింగ్ అర్థాలు లేవా? ఇలాంటివి ఎన్ని చూపించమంటావంటూ ప్రశ్నిస్తున్నారు. చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయని, విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తూనే శివాజీని కాదని నాగబాబు చెప్పారని, మీరు శివాజీ గురించి అనుకుంటే నేనేం చేయలేనంటూ చాలా అతి తెలివిగా మాట్లాడారంటూ అనవసరంగా నాగబాబు నెటిజన్ల చేత విమర్శించుకుంటున్నారు. దారిన పోయే దరిద్రాన్ని అంటించుకోవడం అంటే ఇలాగే ఉంటుందంటున్నారు.
పెద్ద తరహాలో మహిళలకు, ఇతరులకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి, ఆ మంచిమాటలు చెప్పిన శివాజీ లాంటి వారిని విమర్శించడం ఎంత వరకు సబబు అంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే కేవలం 4 నుంచి 5 లైన్లు వార్త వచ్చే ఓ యాప్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వార్త రాస్తే 4వేల మంది చదివారు.. 45వేల మంది డిజ్ లైక్ చేశారు. అంటే వారెవరూ వార్త చదవకుండానే నాగబాబు కామెంట్స్ అనే హెడ్డింగ్ చూసే డిజ్ లైక్ చేశారంటే అతనిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందో అర్థం చేసుకోవచ్చు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications