అఖండ2 కోసం బాలయ్య చేసిన త్యాగం చూశారా?
నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో రాబోతున్న సంచలన చిత్రం అఖండ2. ఇది కూడా రికార్డులు సృష్టించడం ఖాయమని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అనుకోకుండా వాయిదా పడిన ఈ సినిమా ఈనెల 12వ తేదీ లేదంటే 25వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో ఈ నెలలో విడుదలవ్వాల్సిన సినిమాలన్నింటినీ విడుదల చేయాలా? వద్దా? అంటూ నిర్మాతలు ఊగిసలాడుతున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా నిర్మాతలు ఏరోస్ సంస్థకు 28 కోట్ల బాకీ పడ్డారు. మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. ఇటువంటి తరుణంలోనే నిర్మాతలను ఆదుకునేందుకు బాలయ్య ముందుకు వచ్చారు.
రాజకీయంగా సహాయం కోరలేదు..
ఎప్పుడూ నిర్మాతలకు అందుబాటులో ఉండే అగ్రహీరోగా బాలయ్యకు మంచి పేరుంది. నిర్మాతలు ఎంత పారితోషికం ఇస్తే అంతే తీసుకుంటారు. నాకు ఇంత కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయరు. అయితే మూడు సంవత్సరాలుగా నిర్మాతలే బలవంతంగా బాలయ్య పారితోషికాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న పీరియాడికల్ డ్రామాకు 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. అలాగే అఖండ2కు కూడా భారీగా పారితోషికం అందుకున్నారు. అందులో నుంచి 7 కోట్ల రూపాయలు నిర్మాతలకు తిరిగిచ్చేశారు. దీనివల్ల వారు కొంత ఒడ్డున పడ్డట్లు అవుతోంది. అంతేకాదు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాజకీయంగా తన బావ చంద్రబాబు నుంచి ఎటువంటి సహాయం కోరకుండా తన నిబద్ధతను చాటుకున్నారు.

నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనం
నిర్మాతలు 28 కోట్ల బాకీ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చిటికెలో సమస్యను పరిష్కరించవచ్చు. కానీ బాలయ్య వద్దనుకున్నారు. సొంతంగా తమ తిప్పలు తామే పడదామనుకున్నారుకానీ సీఎం సహాయం మాత్రం తీసుకోలేదు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై ప్రశంసలు వస్తున్నాయి. మరొకరైతే రాజకీయంగా వాడుకొని సినిమాను సమస్యల నుంచి బయటపడేసేవారు. నైతిక విలువలకు, నిజాయితీకి, నిబద్ధతకు బాలయ్య ఎలా కట్టుబడి ఉంటాడు? తన తండ్రి నేర్చుకున్న జీవిత పాఠాలను ఎలా అమల్లో పెడుతున్నారు అనేదానికి అఖండ2 విడుదల ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ విషయంలో మాత్రం నందమూరి అభిమానులు బాలయ్యపై పాజిటివ్ కామెంట్లతో సామాజిక మాధ్యమాను హోరెత్తిస్తున్నారు.
-
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications