ప్రభాస్ "స్పిరిట్" రిలీజ్ డేట్ అనౌన్స్.. పూనకాలకు రెడీనా ?
గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు.
టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.

కాగా తన ఫిల్మ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్. ఆయన గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది. అంతే కాకుండా సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్.
కాగా రీసెంట్ గానే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయ్యింది. అలానే న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో నిల్చొని ఉండగా.. త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. చేతిలో మందు బాటిల్ గమనించవచ్చు. ప్రభాస్ మొదటిసాటి అంత రా అండ్ రస్టిక్ గా కనిపించడంతో ఆ ఫోటో ఫుల్ ట్రెండ్ అయ్యింది.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ రివీల్ చేసింది మూవీ యూనిట్. సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఒక కీలక ప్రకటన చేసింది, అందరూ ఊహించినట్లుగా సంక్రాంతికి కాకుండా.. ఈ చిత్రం 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు ప్రకటించారు.
No looking back!!! #Spirit will see the world in theatres on March 5, 2027 🔥#OneBadHabit #Prabhas @imvangasandeep pic.twitter.com/sUAGIPfgU0
— Spirit (@InSpiritMode) January 16, 2026
అయితే సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నా.. మార్చి 5న విడుదల కావడం వల్ల ఈ సినిమాకు లాంగ్ సమ్మర్ సీజన్ ప్లస్ పాయింట్‌గా మారనుందని భావిస్తున్నారు.
-
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ











Click it and Unblock the Notifications