'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో హీరో రాజశేఖర్ మిస్ అయిన పాత్ర ఇదే..!!
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గతంలో అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ, యాక్షన్ అని తేడా లేకుండా అనేక సినిమాలు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు తగ్గించేశారు. గతంలో టాలీవుడ్ హీరో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీలో రాజశేఖర్ ఓ పాత్రలో కనిపించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన సినిమాలు చేయలేదని సమాచారం. అయితే ఇటీవల రాజశేఖర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాల్లో నటిస్తున్నారు.
ఇటీవల శర్వానంద్ 'బైకర్' సినిమాలో రాజశేఖర్ మెరిశారు. శర్వానంద్ తండ్రిగా కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 3 న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా రాజశేఖర్ కీలక విషయాలను వెల్లడించారు. టాలీవుడ్ స్టార్స్ విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోషించిన రేలంగి మావయ్య పాత్ర కోసం ముందుగా తననే అనుకున్నారని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేదని వివరించారు. ఈ సినిమాలో రేలంగి మావయ్య క్యారెక్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అయితే తన నవ్వు బాగుంటుందని అందువల్ల తొలుత ఆ క్యారెక్టర్ తనకే వచ్చిందని అన్నారు. కానీ ఆ సినిమా చేయలేకపోయానని తెలిపారు. ఇక గతంలో ఈ మూవీ విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. రేలంగి మావయ్య పాత్ర కోసం ఫస్ట్ తమిళ స్టార్ హీరో రజనీకాంత్ ను సంప్రదించామని కానీ ఆయనకు అప్పటికే ఉన్న కమిట్ మెంట్స్ వల్ల చేయలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాజశేఖర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications