‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే!
తమిళనాడుకు చెందిన దర్శకులతో సినిమాలు చేసిన మన స్టార్ హీరోలందరికీ వారి కెరీర్ లో మర్చిపోలేని చేదు అనుభవాలను మిగుల్చాయి. ఒక్క పవన్ కల్యాణ్ మినహా. చరిత్రలో తమిళ దర్శకులతో పని చేసి 'ఇండస్ట్రీ హిట్' కొట్టిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన 'ఖుషి', కరుణాకరణ్ తీసిన 'తొలిప్రేమ' వంటి చిత్రాలు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి. అయితే, 'ఖుషి' తర్వాత పవన్ కూడా ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయారు. విష్ణువర్ధన్ తో చేసిన పంజా, ఎస్.జె. సూర్య తో మరోసారి చేసిన కొమరం పులి అభిమానులకు నిరాశను మిగిల్చాయి.
కెరీర్ లోనే మాయని మచ్చలు
తమిళ డైరెక్టర్ల సెంటిమెంట్ వల్ల అత్యధికంగా దెబ్బతిన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మురుగదాస్‌తో చేసిన 'స్పైడర్', ఎస్.జె. సూర్యతో చేసిన 'నాని' చిత్రాలు మహేష్ కెరీర్లో భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గేమ్ చేంజర్' బాక్సాఫీస్ వద్ద ఎంత భారీ పరాజయాన్ని మూటకట్టుకుందో అందరూ చూశారు. పెట్టిన పెట్టుబడిలో కేవలం 40 శాతం మాత్రమే రాగలిగింది. 60 శాతం భారీ నష్టాలు మిగిలాయి.

రామ్ పోతినేని - లింగుస్వామి కాంబోలో వచ్చిన 'వారియర్' కూడా ఇదే తరహాలో భారీ బ్లాక్ బస్టర్ ఫ్లాప్ కొట్టింది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తో చేసిన ఈ పొలిటికల్ డ్రామా విజయ్ కెరీర్ లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.
తమిళ దర్శకుడితో హిట్ కొట్టాలని ఆశిద్దాం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్ కాంబోలో వస్తున్న 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు 'రాకా' అనే పేరు అంత పవర్‌ఫుల్‌గా లేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. బన్నీ లుక్ కూడా పాత సినిమాల్లోని పాత్రలను పోలి ఉందని, అట్లీ మార్క్ 'కాపీ' విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
రికార్డులను తిరగరాయడంలో అల్లు అర్జున్ శైలే వేరు. డైరెక్షన్ పరంగా చిన్నపాటి లోపాలున్నా, తన నటనతో, డ్యాన్స్‌తో సినిమాను గట్టెక్కించగల సత్తా ఆయనకు ఉంది. 'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన బన్నీ, తమిళ దర్శకుల సెంటిమెంట్ ను అడ్డుకొని హిట్ కొట్టాలని ఆశిద్దాం.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం.. -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు!












Click it and Unblock the Notifications