Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో శ్రీరాముడుకి ప్రత్యేక స్థానం ఉంది. ధర్మ రక్షణే శ్వాసగా, పితృవాక్య పరిపాలనే పరమావధిగా సాగిన ఆయన ప్రస్థానం ఒక ఉన్నతమైన జీవన విధానం. ఏకపత్నీ వ్రతం వంటి నైతిక విలువలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన రాముడు.. యుగాలు మారినా తరగని స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాడు. అందుకే రాముడి పాత్రను అర్థం చేసుకోవడం అంటే.. భారతీయత మూలాలను స్పృశించడమని అంటుంటారు.

నటుడికి దక్కిన ఒక అరుదైన వరం..

కాగా వెండితెరపై మర్యాద పురుషోత్తముడి పాత్రను పోషించడం అనేది ఏ నటుడికైనా ఒక గొప్ప సాహసం మరియు అంతకు మించిన అదృష్టం. రాముడిగా కనిపించాలంటే కేవలం నటనలో నైపుణ్యం ఉంటే సరిపోదు. ఆ పాత్రకు కావాల్సిన సాత్విక గుణం ముఖంలో ప్రతిబింబించాలి. అందుకే తెలుగు సినీ చరిత్రలో కొందరు నటులు మాత్రమే ఆ రామయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి నుంచి నేటి గ్రాఫిక్స్ యుగం వరకు పలువురు తెలుగు హీరోలు రామాయణం గాథని వెండితెరపై ఎన్నో అద్భుత రూపాల్లో ఆవిష్కృతం చేశారు. ఆ హీరోలు ఎవరో మీకోసం ప్రత్యేకంగా..

tollywood-heros-list-of-who-played-lord-rama-character-in-cinema-and-other-details-of-movies

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ: నందమూరి తారక రామారావు

తెలుగు తెరపై 'రాముడు' అనగానే కోట్లాది మందికి మొట్టమొదట గుర్తుకు వచ్చే రూపం నందమూరి తారక రామారావు గారే. 'లవకుశ' చిత్రంలో ఆయన ప్రదర్శించిన రాజసం, సీతమ్మ పట్ల ఆయన చూపిన అనురాగం అజరామరం. తెలుగువారి ఇళ్లలో దేవుడి పటాలకు బదులు ఆయన 'రాముడి' స్టిల్స్‌నే పూజించేవారంటే అతిశయోక్తి కాదు.

హరనాథ్ & శోభన్ బాబు..

'సీతారామ కళ్యాణం' చిత్రంలో హరనాథ్ రాముడిగా తనదైన ముద్ర వేయగా, సోగ్గాడు శోభన్ బాబు 'సంపూర్ణ రామాయణం'లో రాముడిగా అద్భుతమైన నటనను కనబరిచారు. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న శోభన్ బాబు గారి సుకుమారమైన రూపం, గంభీరమైన స్వరం ఆ రామయ్య పాత్రకు ఒక కొత్త నిండుతనాన్ని, ఆకర్షణను తీసుకువచ్చాయి.

బాలకృష్ణ & జూనియర్ ఎన్టీఆర్..

తండ్రి బాటలోనే నడుస్తూ నందమూరి బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రాముడిగా మెప్పించారు. దర్శకుడు బాపు పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య తన ఆహార్యం, సంభాషణలతో పాత తరం రాముడిని కళ్లముందు సాక్షాత్కరింపజేశారు. ఇక మహానటుడి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానాన్ని 'బాల రామాయణం'తోనే మొదలుపెట్టారు. ఆ చిన్న వయసులోనే ఆయన పలికిన స్పష్టమైన వాచకం, నటన చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచాయి.

సుమన్ & శ్రీకాంత్..

'శ్రీరామదాసు' చిత్రంలో సుమన్ శ్రీరాముడిగా వెండితెరపై మెరిశారు. ఒక భక్తుడి కల్పనలో రాముడు ఎంత శాంతమూర్తిగా, తేజోవంతంగా ఉంటాడో సుమన్ తన నటనతో అది నిరూపించారు. అలాగే 'దేవుళ్లు' చిత్రంలో నటుడు శ్రీకాంత్ కూడా కాసేపు రాముడిగా కనిపించి ప్రేక్షకులను మురిపించారు.

ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా 'ఆదిపురుష్' చిత్రంలో రాముడిగా (రాఘవ) కనిపించారు. ప్రభాస్ తన నటనతో మెప్పించినప్పటికీ, దర్శకుడి మేకింగ్ స్టైల్, గ్రాఫిక్స్ విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల ఆ సినిమా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+