థాయ్ లాండ్ లో రష్మిక, విజయ్ హనీమూన్.. ఫోటో వైరల్..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సినీ నటి రష్మిక పెళ్లి ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ పూర్తయింది. ఇక ప్రస్తుతం ఈ కొత్త జంట తమ హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రస్తుతం థాయ్ లాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పచ్చని ప్రకృతి నడుమ ఈ కొత్త జంట ఏకాంతంగా గడుపుతున్నట్లుగా ఉంది. దాంతో ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ జంట థాయ్ లాండ్ తీరంలోని కో సముయి ద్వీపంలో ఉన్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడినట్లు తెలుస్తోంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
Tamil Nadu Election: ఒక్కో అఫిడవిట్లో ఒకలా- చిక్కుల్లో విజయ్ ? పోటీపై అనర్హత? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications